రాజపుత్ర సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మానం
ముత్తుకూరు, మేజర్ న్యూస్ : ముత్తుకూరు మండలం అధికార పార్టీ నాయకులు ఈదురు రామ్మోహన్ రెడ్డికి రాజపుత్ర సంఘం ఆధ్వర్యంలో గురువారం స్థానికంగా ఆత్మీయ సన్మానం జరిగింది. ఎంపీపీ అభ్యర్థి అయినటువంటి ఆయనను మర్యాదపూర్వకంగా కార్యవర్గం కలిసి శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు నర్సింగ్ బాలాజీ సింగ్, కార్యదర్శి వీరనాదం జానీ సింగ్, కోశాధికారి శంకర్ సింగ్, తదితరులు పాల్గొన్నారు