BREAKING
14 నుంచి జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు రాష్ట్రంలో ‘సెక్యూరిటీ ఇన్నోవేషన్ శాండ్‌బాక్స్’: హోం మంత్రి అనిత వెల్లడి జడ్పిటిసి ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో అసత్య ప్రచారాలు ఆపండి, మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు రాజపుత్ర సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మానం శాసనమండలి మాజీ విప్ గంగుల సమక్షంలో వైకాపాలో చేరిక ఎన్నికల నియమావళి ని ఖచ్చితంగా పాటించాలి - డి ఎల్ డి వో రమణయ్య కలెక్టరేట్‌ గ్రంథాలయానికి రెండో రోజు పుస్తకాల విరాళం ఇక తెలంగాణలో భారత్ విస్తార్ సేవలు కొత్త హంగులతో ముస్తాబవుతున్న నెల్లూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్! మాచర్ల : శనివారం రిజిస్ట్రేషన్ సేవలు యధాతధం స్థలం విషయంలో మహిళపై దాడి చిన్నారుల్లో న్యుమోనియా నిర్మూలనకు ప్రచారం - నవంబర్ 12 నుంచి ఫిబ్రవరి 28 వరకు విద్యార్థులకు ప్యాడ్లు, నోటుపుస్తకాలు పంపిణీ గుర్తుతెలియని వ్యక్తి మృతి.. ఆచూకీ కోసం పోలీసుల విజ్ఞప్తి

వేసవిలో విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యలు చేపట్టాలి - టీజీ ఎన్పీడీసియల్ సిఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి ఐఏఎస్

Select Suryaa Now
వేసవిలో విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యలు చేపట్టాలి - టీజీ ఎన్పీడీసియల్ సిఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి ఐఏఎస్
సూర్య కుమురంభీమ్ ఆసిఫాబాద్ : కుమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న సూపరింటెండింగ్ ఇంజనీర్  కార్యాలయం, విద్యుత్ రెవెన్యూ కార్యాలయం  భవన నిర్మాణ పనులను తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్  కర్నాటి వరుణ్ రెడ్డి  గురువారం పరిశీలించారు.ఈ సందర్భంగా నిర్మాణ పనుల పురోగతిని, నాణ్యత ప్రమాణాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్ణీత గడువులోగా నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా పనులను పూర్తి చేసి కార్యాలయాలను అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.అనంతరం అధికారులతో నిర్వహించిన సమీక్షలో రాబోయే వేసవిలో ఎల్‌నినో ప్రభావంతో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా ముందస్తు చర్యలు చేపట్టాలని సిఎండీ సూచించారు. ఓవర్‌లోడ్‌కు గురవుతున్న విద్యుత్ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లను ముందుగానే గుర్తించి అవసరమైన చోట అదనపు ట్రాన్స్‌ఫార్మర్లు, కెపాసిటర్ బ్యాంకులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మిషన్ భగీరథ పథకానికి సంబంధించిన విద్యుత్ కనెక్షన్ల కోసం ప్రత్యేక లైన్ నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా అన్‌మ్యాన్డ్ వర్కర్లకు రూ.10 లక్షల గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించేలా చర్యలు తీసుకున్నందుకు యూనియన్ నాయకులు సిఎండీకి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని కోరగా, సిఎండీ సానుకూలంగా స్పందించారు.అనంతరం సర్కిల్ పరిధిలో విద్యుత్ సరఫరా పరిస్థితి, తక్కువ వోల్టేజీ సమస్యలు, వినియోగదారుల ఫిర్యాదులు, సిబ్బందికి సంబంధించిన సమస్యలపై అధికారులతో సమీక్షించి పలు సూచనలు చేశారు. వినియోగదారులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కొమరంభీమ్ సర్కిల్  ఉత్తమ్ జాడే, ఎస్ఏఓ దేవీదాస్, డి ఈ లు సుధాకర్, నాగరాజు, ఏడిఈలు, ఏ ఈలు, అకౌంట్స్ అధికారులు, యూనియన్ నాయకులు, ఓ & ఎం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.