ఘనంగా శివపంచాయతన ఆంజనేయ స్వామి ఆలయ ఉత్సవాలు
సూర్య- బిక్కనూర్ : మండలంలోని భాగిర్తిపల్లి గ్రామంలో ఉన్న శివ పంచాయతన ఆంజనేయస్వామి ఆలయ ప్రథమ వార్షికోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్చకులు నవగ్రహ సమేత పద్మాలయ పూజలను నిర్వహించారు. అనంతరం ఆలయానికి వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఆలయ కమిటీ సభ్యులు నిర్వహించారు. ఈ ఉత్సవాలకు టీపీసీసీ జనరల్ సెక్రటరీ బద్దం ఇంద్రకరణ్ రెడ్డి,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నరసింహులు, ఉపసర్పంచ్ వడ్ల స్వామి,రామేశ్వర్ పల్లి గ్రామ ఉపసర్పంచ్ గొల్లపల్లి వినోద్ కుమార్ గౌడ్,సీనియర్ కాంగ్రెస్ నాయకులు భాగయ్య,రాజారెడ్డి,గ్రామ పెద్దలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు