BREAKING
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ.. జార్ఖండ్ జట్టు ప్రకటన, ఇషాన్‌ కిషన్‌కు దక్కని చోటు! మహిళా వర్సిటీలో విద్యార్థుల ఫీల్డ్ ట్రిప్ శభాష్ చంద్ర..! జనగణనను పకడ్బందీగా నిర్వహించండి లైఫ్‌సైన్సెస్ రంగంలో విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు.. శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం.. లైఫ్‌సైన్సెస్ స్కిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ మధ్య ఒప్పందం ప్రతి విద్యార్థికి హాస్టల్ వసతి కల్పించాలి కే-రిడ్జ్ స్కూల్‌లో ఘనంగా ఎన్‌సీసీ యూనిట్ ప్రారంభోత్సవం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘హైందవ’ నుంచి మెస్మరైజింగ్ రొమాంటిక్ మెలోడీ ‘ఎవరైనా’ విడుదల.. నవంబర్ 27న గ్రాండ్ రిలీజ్! గ్రంథాలయాలు విజ్ఞానాలయాలు రోడ్డు భద్రత ప్రమాణాలు పాటించాలి : ఇంకొల్లు సి.ఐ రామ్‌ నాయక్‌ నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి సిపిఎస్ నుంచి ఓపిఎస్ కు అవకాశం డిసెంబర్ 31 లోపు నిధి పోర్టల్ లో దరఖాస్తు చేసుకోవాలి : డిఇఓ వైఎస్ జగన్‌ను కలిసిన చవ్వా రాజశేఖర్ రెడ్డి *మధిర మున్సిపల్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవ తీర్మానాలు* *మధిర మున్సిపల్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవ తీర్మానాలు*

న్యుమోనియా నివారణతోనే బాల్యానికి భరోసా - డా. మానస

Select Suryaa Now
న్యుమోనియా నివారణతోనే బాల్యానికి భరోసా - డా. మానస

ప్రొద్దుటూరు అర్బన్ మేజర్ న్యూస్:

ప్రపంచ న్యుమోనియా దినోత్సవాన్ని పురస్కరించుకొని యు.పి.హెచ్.సీ టి.బి రోడ్  ఆధ్వర్యంలో పట్టణంలోని వైఎంఆర్ కాలనీలో ఉన్న పట్టణ ఆరోగ్య కేంద్రం వద్ద న్యుమోనియా వ్యాధిపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు, ఆరోగ్య సిబ్బంది న్యుమోనియా వ్యాధి లక్షణాలు, వ్యాప్తికి గల కారణాలు, నివారణ చర్యలు, ముందస్తు జాగ్రత్తలపై ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కాటారు మానస మాట్లాడుతూ న్యుమోనియా నివారణ బాల్యానికి భరోసా అని పేర్కొన్నారు. ముఖ్యంగా చిన్నపిల్లల్లో న్యుమోనియా పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. స్వచ్ఛమైన గాలి, పరిశుభ్రమైన పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే సకాలంలో వైద్యం పొందడం ద్వారా న్యుమోనియా ముప్పును తగ్గించవచ్చని తెలిపారు. చిన్నారుల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేయకుండా తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. న్యుమోనియా సోకినప్పుడు చలితో కూడిన దగ్గు పెరగడం, వేగంగా లేదా తీవ్రంగా శ్వాస తీసుకోవడం, ఊపిరితిత్తులకు సంబంధించిన ఇబ్బందులు, శ్వాస తీసుకునే సమయంలో శబ్దం రావడం, అధిక జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయని వివరించారు. ఇలాంటి లక్షణాలను గుర్తించిన వెంటనే ఆలస్యం చేయకుండా సమీప ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వైద్యులను సంప్రదించాలని సూచించారు. వ్యాధి తీవ్రత పెరిగిన తర్వాత చికిత్స పొందడం కంటే ప్రారంభ దశలోనే గుర్తించి వైద్యం అందించడం ఎంతో ముఖ్యమని తెలిపారు. అలాగే న్యుమోనియా నివారణలో భాగంగా మాస్కులు ధరించడం, తరచూ చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, స్వచ్ఛమైన తాగునీటిని వినియోగించడం, పౌష్టికాహారం తీసుకోవడం వంటి ఆరోగ్య నియమాలను ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. ముఖ్యంగా చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు కుటుంబ సభ్యులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని పేర్కొన్నారు. అనంతరం సీఓఎం సుబ్బారెడ్డి మాట్లాడుతూ న్యుమోనియా వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంపొందించి, వ్యాధి నివారణకు సమష్టిగా కృషి చేయాలనే లక్ష్యంతో సాన్స్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రచార కార్యక్రమం నవంబర్ 12 నుంచి ఫిబ్రవరి 28, 2027 వరకు కొనసాగుతుందని వెల్లడించారు. క్యాంపెయిన్‌లో భాగంగా ఆరోగ్య సిబ్బంది తమ తమ సచివాలయ పరిధుల్లోని గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు న్యుమోనియా వ్యాధిపై అవగాహన కల్పిస్తారని తెలిపారు. వ్యాధి లక్షణాలను ముందుగానే గుర్తించడం, సకాలంలో వైద్య సేవలు పొందడం, నివారణ చర్యలను ప్రజలకు చేరవేయడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని వివరించారు. సదస్సు అనంతరం న్యుమోనియా నివారణపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి వైఎంఆర్ కాలనీలోని పురవీధుల గుండా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యాధి నివారణకు పాటించాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది, ట్రైనీ నర్సింగ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

ప్రతాప్ ప్రొద్దుటూరు అర్బన్ వైఎస్సార్ కడప జిల్లా