BREAKING
ఆరోగ్య కార్యక్రమాల అమలులో నిర్లక్ష్యం వద్దు గ్రామ పంచాయతీల పోరుకు మోగిన నగారా.. గ్రామ పంచాయతీల పోరుకు మోగిన నగారా.. ప్రతి రైతుకు డిజిటల్ గుర్తింపు.. వ్యవసాయ సేవలకు సరికొత్త భరోసా. ఇండస్ట్రీయల్ ప్రాజెక్ట్ పై వర్క్ షాప్ ఆదివాసీ మహిళకు అగ్రతాంబూలం ఘాట్ రోడ్డు పునరుద్ధరణ పనులు క్లియర్ గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై శిక్షణ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కూటమి పాలనలోనే ..:ఎమ్మెల్యే బండారు ఎంపీటీసీ రాజ్ కుమార్‌కు ఘన సన్మానం ఆ ఆరోపణలు అవాస్తవం... విశాఖలో సినీ ఇండస్ట్రీ అభివృద్ధిపై నారా లోకేష్, రానా దగ్గుబాటి కీలక చర్చ.. సీఐఐ సదస్సులో ఆసక్తికర దృశ్యం! రోడ్డు ప్రమాదంలో యువకులకు గాయాలు కొత్త రేవుపోలవరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం! ఏటికొప్పాక కళాకృతుల స్టాల్‌ను సందర్శించిన ఉపరాష్ట్రపతి, గవర్నర్, ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు తదితరులు

లైఫ్‌సైన్సెస్ రంగంలో విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు.. శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం.. లైఫ్‌సైన్సెస్ స్కిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ మధ్య ఒప్పందం

Select Suryaa Now
లైఫ్‌సైన్సెస్ రంగంలో విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు..  శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం.. లైఫ్‌సైన్సెస్ స్కిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ మధ్య ఒప్పందం

అనంతపురం విద్య మేజర్ న్యూస్  :-లైఫ్‌సైన్సెస్ రంగంలో విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి, పరిశ్రమల శిక్షణ, ధ్రువీకరణ, ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం (ఎస్‌కేయూ), లైఫ్‌సైన్సెస్ స్కిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ ఒప్పందం ద్వారా విద్యార్థులకు పరిశ్రమల ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ, నైపుణ్య ధ్రువీకరణ, ఇంటర్న్‌షిప్‌లు, క్యాంపస్ నియామకాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు, అత్యుత్తమ శిక్షణ కేంద్రాల ద్వారా పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా శిక్షణ అందించనున్నారు.
ఈ సందర్భంగా ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.వి.ఆర్. జ్యోతి కుమార్ మాట్లాడుతూ.. విద్యాసంస్థలు, పరిశ్రమల మధ్య అనుసంధానం ద్వారా విద్యార్థులకు ప్రాయోగిక పరిజ్ఞానం, మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు.

 మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్..