BREAKING
బ్రహ్మాసముద్రం మండలం,ఎరిడికేరా సర్పంచ్ అభ్యర్థి గా గాజుల కుమార్ ఎన్నిక. పీఎం శ్రీ పాఠశాలలో కెరీర్ గైడెన్స్, బాలికా సాధికారత, అడోలసెంట్ క్లబ్ కార్యక్రమాలు రైతుల విద్యుత్ కష్టాలకు తెర.. కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు శ్రీ కాళహస్తి మున్సిపాలిటీ చైర్మన్ కొరకు సర్వే కూరగాయల సాగుతో అదనపు ఆదాయం ఆయిల్‌పామ్ తోటల్లో అంతర పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి పేదల సొంతింటి కల కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం కూటమి విజయంతో రాష్ట్రానికి ఆదర్శం. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ధ్యానంతో మానసిక ప్రశాంతత.. అహింసా జగత్‌ పిరమిడ్‌ ధ్యాన ఆశ్రమం ప్రారంభం శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో మంటలు ఆర్బీఐ రెడ్ లైన్ దాటిన రిటైల్ ద్రవ్యోల్బణం: అక్టోబర్‌లో రెండేళ్ల గరిష్టం 6.09% నమోదు చీరాలలో టీడీపీలోకి 50 కుటుంబాల చేరిక సామాన్యుడికి ద్రవ్యోల్బణం సెగ: పాలు, నెయ్యి, సబ్బులు, సిగరెట్ల ధరల పెరుగుదల భారత పీఎల్ఐ (PLI) పథకాల రిపోర్ట్ కార్డ్: అంచనాలను అందుకున్న రంగాలు, వెనుకబడిన రంగాల పూర్తి వివరాలు 48వ డివిజన్‌లో విద్యుత్ అంతరాయం యుద్ధప్రాతిపదికన మరమ్మతులు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇచ్చిన ఆ సలహానే నాకు శ్రీరామరక్ష.. యంగ్ పేసర్ ఆకిబ్ నబీ కీలక వ్యాఖ్యలు!

జనగణనను పకడ్బందీగా నిర్వహించండి

Select Suryaa Now
జనగణనను పకడ్బందీగా నిర్వహించండి

చిత్తూరు ప్రతినిధి మేజర్ న్యూస్: జనగణన–2027లో భాగంగా రెండో దశలో నిర్వహించనున్న జనాభా గణన ప్రక్రియను పకడ్బందీగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులు, సిబ్బంది పూర్తి అవగాహనతో శిక్షణ పొందాలని డి ఆర్ ఓ 

 మోహన్ కుమార్ పేర్కొన్నారు.గురువారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశం మందిరములో జిల్లా స్థాయి అధికారులకు ఈనెల 12 వ తేదీ నుంచి 14వ తేదీ వరకు మూడు రోజుల పాటు నిర్వహించనున్న శిక్షణ కార్యక్రమంలో డిఆర్ఓ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు, ఈ కార్యక్రమంలో ముని చంద్ర, లక్ష్మీ కళ, అధికారులు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా డిఆర్ఓ కే మోహన్ కుమార్ మాట్లాడుతూ జనగణన నిర్వహణపై మూడు రోజుల పాటు అందించే శిక్షణను అధికారులు, సిబ్బంది పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శిక్షణలో వివరించే ప్రతి అంశాన్ని శ్రద్ధగా విని, ముఖ్యమైన విషయాలను నోట్ చేసుకోవాలని, ఎలాంటి సందేహాలు ఉన్నా వెంటనే ప్రశ్నలను మాస్టర్ ట్రైనర్లను అడిగి నివృత్తి చేసుకోవాలని తెలిపారు. శిక్షణ పూర్తయ్యే సమయానికి ప్రతి ఒక్కరికీ జనాభా గణన ప్రక్రియపై పూర్తి అవగాహన ఉండాలని స్పష్టం చేశారు. ప్రజల ఇళ్లకు వెళ్లినప్పుడు చిరునవ్వుతో, స్నేహపూర్వకంగా మాట్లాడాలని, వారి సహకారాన్ని కోరాలని తెలిపారు. ప్రజలతో దురుసుగా వ్యవహరించకుండా, ఓపికగా వారి సందేహాలను నివృత్తి చేయాలని సూచించారు. ప్రజల సహకారం, అధికారుల సానుకూల వైఖరి జనగణన విజయవంతానికి దోహదపడతాయని పేర్కొన్నారు.ప్రస్తుతం 68 మంది ఫీల్డ్ ట్రైనర్లకు మూడు రోజుల పాటు శిక్షణ కొనసాగుతోందని, పంచాయతీ ఎన్నికల ప్రక్రియ డిసెంబర్ 3వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో, డిసెంబర్ 5వ తేదీ తర్వాత ఈ ఫీల్డ్ ట్రైనర్ల ద్వారా జిల్లాలోని సూపర్వైజర్లు, ఎన్యూమరేటర్లకు క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయి శిక్షణ అందజేస్తారు. గతంలో నిర్వహించిన హౌస్ లిస్టింగ్ ప్రక్రియలో తలెత్తిన ఖాళీ ఇళ్లు, మ్యాపింగ్ లోపాల వంటి సాంకేతిక సమస్యలను గత రెండు-మూడు నెలలుగా అధికారులు నిశితంగా పరిశీలించి 99.9 శాతం వరకు సరిదిద్దారు.జిల్లా పరిధిలో ఉన్న దాదాపు మూడు వేలకు పైగా హౌస్ లిస్టింగ్ బ్లాక్‌లను రాష్ట్ర స్థాయి ఆడిట్ ద్వారా క్షుణ్ణంగా తనిఖీ చేసి తుది గణనకు సిద్ధంగా ఉంచారు.భారతదేశంలో 1872 నుండి జనాభా గణన జరుగుతుండగా, 2027లో నిర్వహించేది దేశంలో 16వ దని స్వాతంత్య్రానంతరం 8వ జనాభా గణన అని అధికారులు వివరించారు. 150 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ప్రక్రియలో తొలిసారిగా పూర్తిస్థాయి డిజిటల్ మాధ్యమాలను వినియోగిస్తున్నారన్నారు. ఎన్యూమరేటర్లు తమ స్మార్ట్‌ఫోన్లలో ప్రత్యేక మొబైల్ యాప్‌ల సహాయంతో కుటుంబాల నుండి నేరుగా డేటాను సేకరిస్తారు. పౌరులు తమ వివరాలను ప్రత్యేక వెబ్ పోర్టల్ ద్వారా స్వయంగా నమోదు చేసుకునే వీలు కల్పించారు. అయితే, ఈ డేటా ఖచ్చితత్వాన్ని నిర్ధారించేందుకు ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్ల క్షేత్రస్థాయి ధృవీకరణ తప్పనిసరిగా ఉంటుంది. పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారుల తదితరులు పాల్గొన్నారు.

 

ఉమాశంకర్ చిత్తూరు స్టాఫ్ రిపోర్టర్.