మహిళా వర్సిటీలో విద్యార్థుల ఫీల్డ్ ట్రిప్
ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆంగ్ల విభాగం ఆధ్వర్యంలో డిగ్రీ విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలపై అవగాహన కల్పించేందుకు ఫీల్డ్ ట్రిప్ నిర్వహించారు. గురువారం ఎస్‌పీడబ్ల్యూ మహిళా కళాశాల, ఎస్‌జీఎస్ ఆర్ట్స్ కళాశాలలకు చెందిన 100 మంది ఆంగ్ల సాహిత్య విద్యార్థులు మహిళా వర్సిటీ క్యాంపస్ ను సందర్శించారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయంలోని కేంద్ర గ్రంథాలయం, ఆంగ్ల విభాగం, హ్యుమానిటీస్ బ్లాక్ తదితర సౌకర్యాలను సందర్శించారు. విశ్వవిద్యాలయ విద్యా వాతావరణం, పరిశోధనా సౌకర్యాలను ప్రత్యక్షంగా తెలుసుకుని, ఆంగ్ల విభాగ అధ్యాపకులు, పరిశోధకులతో స్నాతకోత్తర విద్య, పరిశోధన, భవిష్యత్ ఉద్యోగావకాశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో డీన్ ఆచార్య పి. విజయలక్ష్మి, ఆచార్యులు టి.భారతి, వై.ఎస్. శారద, పి.హరిపద్మరాణి, నీరజ, వి. నిర్మల, ఎస్‌పీడబ్ల్యూ అధ్యాపకులు సుభాషిణి, డా.లక్ష్మి, డా.మాధవి, ఎస్‌జీఎస్ ఆంగ్ల శాఖ అధ్యక్షులు పి.చంద్రయ్య, అధ్యాపకులు డా. వెంకటరమణమ్మ, డా.గంగాభవాని పాల్గొన్నారు.
సీఎం గౌడ్ తిరుపతి స్టాఫ్ రిపోర్టర్