BREAKING
చకుముఖి టాలెంట్ టెస్టులో శ్రీవాణి విద్యార్థుల ప్రతిభ శ్రీకాళహస్తి పురపాలక సంఘం ఎన్నికలు ప్రారంభం అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారి వర్షిత్‌కు జగన్‌మోహన్‌రెడ్డి భరోసా కలిసికట్టుగా పని చేద్దాం సర్పంచ్ ఎన్నికల్లో గెలుద్దాం ఈ నెల 19న సీఎం రేవంత్ రెడ్డి సభకు సిద్దిపేటలో ఏర్పాట్లు షురూ! బ్రహ్మాసముద్రం మండలం,ఎరిడికేరా సర్పంచ్ అభ్యర్థి గా గాజుల కుమార్ ఎన్నిక. పీఎం శ్రీ పాఠశాలలో కెరీర్ గైడెన్స్, బాలికా సాధికారత, అడోలసెంట్ క్లబ్ కార్యక్రమాలు రైతుల విద్యుత్ కష్టాలకు తెర.. కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు శ్రీ కాళహస్తి మున్సిపాలిటీ చైర్మన్ కొరకు సర్వే కూరగాయల సాగుతో అదనపు ఆదాయం ఆయిల్‌పామ్ తోటల్లో అంతర పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి పేదల సొంతింటి కల కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం కూటమి విజయంతో రాష్ట్రానికి ఆదర్శం. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ధ్యానంతో మానసిక ప్రశాంతత.. అహింసా జగత్‌ పిరమిడ్‌ ధ్యాన ఆశ్రమం ప్రారంభం శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో మంటలు ఆర్బీఐ రెడ్ లైన్ దాటిన రిటైల్ ద్రవ్యోల్బణం: అక్టోబర్‌లో రెండేళ్ల గరిష్టం 6.09% నమోదు

ప్రతి విద్యార్థికి హాస్టల్ వసతి కల్పించాలి

Select Suryaa Now
ప్రతి విద్యార్థికి హాస్టల్ వసతి కల్పించాలి

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ :  శ్రీపద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో ప్రవేశం పొందిన ప్రతి విద్యార్థినికి హాస్టల్ వసతి కల్పించాలని స్టూడెంట్స్ జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం టీటీడీ జేఈఓను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మట్లాడుతూ టీటీడీ విద్యా సంస్థలో విద్యానభ్యసించాలనే కోరికతో ఎంతో మంది పేద విద్యార్థులు రాయలసీమలోని పలు జిల్లాల నుంచి వ్యయప్రయాసలకోర్చి ప్రవేశాలు పొందుతున్నారని తెలిపారు. కళాశాలలో ప్రవేశం పొందిన విద్యార్థినులందరికీ హాస్టల్ వసతి అందుబాటులో లేకపోవడంతో పేద విద్యార్థినులు ప్రైవేటు హాస్టళ్లలో అధిక మొత్తంలో అద్దెలు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేధన వ్యక్తం చేశారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలించక కొంతమంది విద్యార్థినులు ఉన్నత విద్యను కొనసాగించలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలిపారు. టీటీడీ అనేక విద్యా సంస్థలను నిర్వహిస్తూ పేద విద్యార్థులకు విద్యావకాశాలు కల్పిస్తున్న నేపథ్యంలో శ్రీపద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో చేరిన ప్రతి విద్యార్థినికి హాస్టల్ వసతి కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తీసుకోవాలని కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో భారతీయ దళిత విద్యార్ధి సేన వ్యవస్థాపక అధ్యక్షుడు కొండా యుగంధర్, వాల్మీకి విద్యార్ధి సంఘం అధ్యక్షురాలు వినూత, విద్యార్థి నేతలు శివకుమార్, శ్రీధర్, మహేష్, అర్జున్, కృష్ణ, నాగార్జున పాల్గొన్నారు. 

సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్