పూతలపట్టులో యస్ ఏ ఏ యన్ యస్ కార్యక్రమం ప్రారంభం – చిన్న పిల్లల్లో న్యూమోనియా నివారణే లక్ష్యం
పూతలపట్టు మేజర్ న్యూస్
చిన్న పిల్లల్లో న్యూమోనియా కారణంగా సంభవించే మరణాలను తగ్గించడమే ధ్యేయంగా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన యస్ ఏ ఏ యన్ యస్ (సోషల్ అవేర్‌నెస్ అండ్ యాక్షన్ టూ న్యూట్రలైజ్ నిమోనియా సక్సెస్ఫుల్లీ) కార్యక్రమాన్ని గురువారం పూతలపట్టు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా వ్యాధి నివారణ అధికారి డాక్టర్ అనూష ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె ఆరోగ్య సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ, 2026 నవంబర్ 12 నుండి 2027 ఫిబ్రవరి 28 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. చిన్న పిల్లల్లో న్యూమోనియా రాకుండా తగిన నివారణ చర్యలు తీసుకోవడం, రక్షణ కల్పించడం మరియు సరైన చికిత్స అందించడంపై ప్రజల్లో విస్తృతమైన అవగాహన కల్పించాలని సూచించారు వ్యాధి లక్షణాలను ప్రారంభ దశలోనే గుర్తించి, తల్లిదండ్రులు సకాలంలో వైద్య సేవలు అందేవిధంగా ప్రజల్లో అవగాహన పెంపొందించాలని, ముఖ్యంగా పిల్లలకు పీసీవీ వ్యాక్సిన్ వేయించడం ఎంతో ముఖ్యం అని ఆమె నొక్కి చెప్పారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ ప్రియాంక, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ, ఆరోగ్య విస్తరణ అధికారి నరసింహ ప్రసాద్, హెల్త్ సూపర్‌వైజర్ ధర్మేంద్ర, హెచ్‌ఏ సతీష్, ఎంఎల్‌హెచ్‌పీలు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
పూతలపట్టు రిపోర్టర్ దిలీప్ కుమార్