BREAKING
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ.. జార్ఖండ్ జట్టు ప్రకటన, ఇషాన్‌ కిషన్‌కు దక్కని చోటు! మహిళా వర్సిటీలో విద్యార్థుల ఫీల్డ్ ట్రిప్ శభాష్ చంద్ర..! జనగణనను పకడ్బందీగా నిర్వహించండి లైఫ్‌సైన్సెస్ రంగంలో విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు.. శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం.. లైఫ్‌సైన్సెస్ స్కిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ మధ్య ఒప్పందం ప్రతి విద్యార్థికి హాస్టల్ వసతి కల్పించాలి కే-రిడ్జ్ స్కూల్‌లో ఘనంగా ఎన్‌సీసీ యూనిట్ ప్రారంభోత్సవం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘హైందవ’ నుంచి మెస్మరైజింగ్ రొమాంటిక్ మెలోడీ ‘ఎవరైనా’ విడుదల.. నవంబర్ 27న గ్రాండ్ రిలీజ్! గ్రంథాలయాలు విజ్ఞానాలయాలు రోడ్డు భద్రత ప్రమాణాలు పాటించాలి : ఇంకొల్లు సి.ఐ రామ్‌ నాయక్‌ నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి సిపిఎస్ నుంచి ఓపిఎస్ కు అవకాశం డిసెంబర్ 31 లోపు నిధి పోర్టల్ లో దరఖాస్తు చేసుకోవాలి : డిఇఓ వైఎస్ జగన్‌ను కలిసిన చవ్వా రాజశేఖర్ రెడ్డి *మధిర మున్సిపల్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవ తీర్మానాలు* *మధిర మున్సిపల్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవ తీర్మానాలు*

మొక్కుబడిగా మండల సర్వసభ్య సమావేశం

Select Suryaa Now
మొక్కుబడిగా  మండల సర్వసభ్య సమావేశం

కొండాపూర్ ; మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశం మొక్కుబడిగా కొనసాగింది. ఉదయం 11 గంటలకు ప్రారంభం కావాల్సిన సమావేశం 11.30  గంటలకు ప్రారంభం కాగా, అధికారులు, ప్రజాప్రతినిధులు ఒక్కొక్కరుగా మధ్యాహ్నం 1.30 గంటల వరకు హాజరయ్యారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై చర్చించి పరిష్కారాలు చూపాల్సిన సమావేశం కాస్తా  చాయ్, అల్పాహారానికే పరిమితమైందని పలువురు సర్పంచులు అసంతృప్తి వ్యక్తం చేశారు.గ్రామాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కారం కాకుండా సమావేశాలు నిర్వహించడం వల్ల ప్రయోజనమేమిటని సర్పంచులు ప్రశ్నించారు. పలు శాఖల అధికారులు సమావేశానికి హాజరుకాకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. సమావేశం నిర్వహించాల్సిన అధికారులు సైతం తూతూమంత్రంగా కార్యక్రమాన్ని ముగించారనే విమర్శలు వ్యక్తమయ్యాయి.ఈ సందర్భంగా గొల్లపల్లి సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ మునిదేవునిపల్లి  గ్రామ సర్పంచ్ దళితుడు కావడం వల్లే గ్రామంలో ఏడాది కాలంగా అభివృద్ధి పనులు చేపట్టినా ఎం బి లు చేయడం లేదని, బిల్లులు చెల్లించకపోవడానికి కారణాలేమిటని అధికారులను నిలదీశారు. పనులు పూర్తిచేసినప్పటికీ చెల్లింపులు జరగకపోవడంతో గ్రామాల్లో అభివృద్ధి పనులకు ఆటంకం ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. శివన్న గూడెం సర్పంచ్ వినోద్ మాట్లాడుతు వడ్లు ప్రభుత్వం కొనడం లేదు రైతు లను ఆడుకోవాలన్నారు అనంతరం విద్యుత్ తదితర సమస్యలపై చర్చించారు.ఈ సమావేశంలో తహసీల్దార్ అశోక్, ఎంపీడీవో సౌమ్యశ్రీ, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ రవి, విద్యుత్ శాఖ అధికారి సిద్ధరాజ్, వ్యవసాయ అధికారి గణేశ్, ఏపీవో వీరప్ప, సర్పంచులు వినోద్, శ్రీనివాస్ గౌడ్ , కృష్ణ, స్రవంతి సంఘమేశ్వర్ సతీష్ సంగీత రాంచేంద్రారెడ్డి  తదితరులు పాల్గొన్నారు.