BREAKING
చకుముఖి టాలెంట్ టెస్టులో శ్రీవాణి విద్యార్థుల ప్రతిభ శ్రీకాళహస్తి పురపాలక సంఘం ఎన్నికలు ప్రారంభం అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారి వర్షిత్‌కు జగన్‌మోహన్‌రెడ్డి భరోసా కలిసికట్టుగా పని చేద్దాం సర్పంచ్ ఎన్నికల్లో గెలుద్దాం ఈ నెల 19న సీఎం రేవంత్ రెడ్డి సభకు సిద్దిపేటలో ఏర్పాట్లు షురూ! బ్రహ్మాసముద్రం మండలం,ఎరిడికేరా సర్పంచ్ అభ్యర్థి గా గాజుల కుమార్ ఎన్నిక. పీఎం శ్రీ పాఠశాలలో కెరీర్ గైడెన్స్, బాలికా సాధికారత, అడోలసెంట్ క్లబ్ కార్యక్రమాలు రైతుల విద్యుత్ కష్టాలకు తెర.. కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు శ్రీ కాళహస్తి మున్సిపాలిటీ చైర్మన్ కొరకు సర్వే కూరగాయల సాగుతో అదనపు ఆదాయం ఆయిల్‌పామ్ తోటల్లో అంతర పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి పేదల సొంతింటి కల కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం కూటమి విజయంతో రాష్ట్రానికి ఆదర్శం. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ధ్యానంతో మానసిక ప్రశాంతత.. అహింసా జగత్‌ పిరమిడ్‌ ధ్యాన ఆశ్రమం ప్రారంభం శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో మంటలు ఆర్బీఐ రెడ్ లైన్ దాటిన రిటైల్ ద్రవ్యోల్బణం: అక్టోబర్‌లో రెండేళ్ల గరిష్టం 6.09% నమోదు

24 గంటల్లో ప్రజా సమస్యకు పరిష్కారం!

Select Suryaa Now
24 గంటల్లో ప్రజా సమస్యకు పరిష్కారం!

నెల్లూరు సిటీ,  మేజర్ న్యూస్ :  నెల్లూరు నగరం 21వ డివిజన్, అపోలో హాస్పిటల్ జంక్షన్ వద్ద శాంతి స్వీట్స్ పక్కన ఉన్న గుంత కారణంగా స్థానిక ప్రజలు, వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్థానికుల అభ్యర్థన మేరకు 21వ డివిజన్ జనసేన కార్పొరేటర్ గునుకుల విజయలక్ష్మి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.  సమస్యను అధికారులకు తెలియజేసిన వెంటనే స్పందించిన కమిషనర్,అడిషనల్ కమిషనర్ మరియు సంబంధిత మున్సిపల్ అధికారులు కార్పొరేటర్‌తో చర్చించి కేవలం 24 గంటల వ్యవధిలోనే గుంతను పూడ్చేందుకు చర్యలు తీసుకున్నారు. పైప్‌లైన్ పనుల అనంతరం ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం రెండు నెలల వ్యవధిలో పూర్తికావాల్సి ఉన్నప్పటికీ, అప్పటివరకు స్థానికులకు ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు చేపట్టడం అభినందనీయమని విజయలక్ష్మి తెలిపారు.

“సమస్య ఎక్కడ ఉంటే అక్కడే ఉండాలి”  అనే పవన్ కళ్యాణ్ గారి ప్రజాసేవా స్ఫూర్తికి అనుగుణంగా జనసేన పార్టీ ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తోందని జనసేన నాయకులు కిషోర్ గునుకుల పేర్కొన్నారు.  మున్సిపల్ శాఖ మంత్రి, నెల్లూరు నగర ఎమ్మెల్యే పొంగూరు నారాయణ గారి మార్గదర్శకత్వంలో ప్రజా సమస్యలకు వేగవంతమైన పరిష్కారాలు అందుతున్నాయని, ఈ ఘటన మరోసారి నిరూపించిందని తెలిపారు. ఈ సమస్య పరిష్కారానికి వెంటనే స్పందించిన అడిషనల్ కమిషనర్ హిమబిందు గారికి,  సంబంధిత మున్సిపల్ అధికారులు మరియు సిబ్బందికి కార్పొరేటర్ విజయలక్ష్మి గునుకుల హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కిషోర్ గునుకుల, ప్రశాంత్ గౌడ్, చండ్ర మధు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.