సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ
సంగారెడ్డి ; ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) ద్వారా మంజూరైన చెక్కులను సదాశివపేట మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన పది మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. సంగారెడ్డిలోని జగ్గారెడ్డి నివాసం వద్ద సీడీసీ చైర్మన్ గడీల రాంరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా మొత్తం రూ.2,68,500 విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయోగపడుతుందని నాయకులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సదాశివపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సిద్ధన్న, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఒగ్గు శ్రీనివాస్, మండల నాయకులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.