భక్తిశ్రద్ధలతో పోచమ్మ బోనాలు
*భక్తిశ్రద్ధలతో పోచమ్మ బోనాలు*
నవాబుపేట సూర్య న్యూస్: కార్తీక మాసాన్ని పురస్కరించుకొని మండల కేంద్రం నవాబుపేటలో జాండ్ర కులస్తులు పోచమ్మ బోనాల పండుగను గురువారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా జాండ్ర కులానికి చెందిన మహిళలు సంప్రదాయబద్ధంగా బోనాలను అందంగా అలంకరించి గ్రామ ప్రధాన రహదారుల గుండా డప్పుచప్పుళ్లు,భక్తుల జయజయధ్వానాల మధ్య ఘనంగా ఊరేగింపు నిర్వహించారు.అనంతరం పోచమ్మ దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.అమ్మవారి ఆశీస్సులతో గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో,ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు.బోనాల వేడుకలతో గ్రామంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది.ఈ వేడుకల్లో గ్రామ నీలకంఠుడు కూచూర్ చిన్నయ్య,సంఘం అధ్యక్షుడు దేవరకొండ శివకుమార్,నాయకులు దేవరకొండ చంద్రశేఖర్,కిరణ్ కుమార్,మంత నర్సింలు,మంత శ్రీనివాసులు,శివ,స్వామి,గట్టప్పగారి స్వామి,నారాయణ, యాదయ్య,జాండ్ర కులస్తులు,మహిళలు,చిన్నారులు,గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.