స్థలాలు కోల్పోయిన బాధితులకు ఎమ్యెల్యే ఆర్ధిక సహాయం
స్థలాలు కోల్పోయిన బాదితులకు ఎమ్యెల్యే ఆర్ధిక సహాయం
కనిగిరి ,మేజర్ న్యూస్ :మున్సిపాలిటీ పరిధిలోని ఒంగోలు రహదారిలో గల చెరువుకట్ట వద్ద ఆక్రమణల తొలగింపుతో స్థలాలు కోల్పోయిన కుటుంబాలకు ఎమ్యెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అర్థిక సహాయం అందించి అండగా నిలిచారు .ఒక్కొక్క కుటుంబానికి 25,000 చొప్పున 9 కుటుంబాలకు 2.25 లక్షలు ఆర్థిక సహాయాన్ని మున్సిపల్ చైర్మన్ అచ్చాల తిరుపతమ్మ ,పట్టణ టీడీపి అధ్యక్షులు ,వార్డు కౌన్సిలర్ షేక్ ఫిరోజ్ ,తెలుగు యువత అధ్యక్షులు అచ్చాల రవి చేతుల మీదుగా నగదును గురువారం అందజేశారు .ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పర్వతనేని శ్రీధర్, కౌన్సిలర్లు షేక్ ఖాసీం పీరా, ఒంటిపెంట శ్రీరాములు రెడ్డి, టీడిపి నాయకులు చీర్ల నాగార్జున యాదవ్ తదితరులు పాల్గొన్నారు.