BREAKING
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ.. జార్ఖండ్ జట్టు ప్రకటన, ఇషాన్‌ కిషన్‌కు దక్కని చోటు! మహిళా వర్సిటీలో విద్యార్థుల ఫీల్డ్ ట్రిప్ శభాష్ చంద్ర..! జనగణనను పకడ్బందీగా నిర్వహించండి లైఫ్‌సైన్సెస్ రంగంలో విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు.. శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం.. లైఫ్‌సైన్సెస్ స్కిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ మధ్య ఒప్పందం ప్రతి విద్యార్థికి హాస్టల్ వసతి కల్పించాలి కే-రిడ్జ్ స్కూల్‌లో ఘనంగా ఎన్‌సీసీ యూనిట్ ప్రారంభోత్సవం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘హైందవ’ నుంచి మెస్మరైజింగ్ రొమాంటిక్ మెలోడీ ‘ఎవరైనా’ విడుదల.. నవంబర్ 27న గ్రాండ్ రిలీజ్! గ్రంథాలయాలు విజ్ఞానాలయాలు రోడ్డు భద్రత ప్రమాణాలు పాటించాలి : ఇంకొల్లు సి.ఐ రామ్‌ నాయక్‌ నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి సిపిఎస్ నుంచి ఓపిఎస్ కు అవకాశం డిసెంబర్ 31 లోపు నిధి పోర్టల్ లో దరఖాస్తు చేసుకోవాలి : డిఇఓ వైఎస్ జగన్‌ను కలిసిన చవ్వా రాజశేఖర్ రెడ్డి *మధిర మున్సిపల్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవ తీర్మానాలు* *మధిర మున్సిపల్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవ తీర్మానాలు*

రాళ్ల రోడ్డుపై విద్యార్థుల నరకయాతన

Select Suryaa Now
రాళ్ల రోడ్డుపై విద్యార్థుల నరకయాతన

*--రోజూ 4 కిలోమీటర్లు కాలినడకన బడిబాట.* 

 *--మూడేళ్లుగా కంకర రోడ్డుకే పరిమితమైన తారు రోడ్డు పనులు.* 

 *--70 మంది విద్యార్థులకు తప్పని తిప్పలు.* 

 *--బస్సు,తారు రోడ్డు సౌకర్యం కల్పించాలని తల్లిదండ్రుల వేడుకోలు.* నవాబుపేట సూర్య న్యూస్:బడికి వెళ్లాలంటే బస్సు సౌకర్యం లేదు..నడిచి వెళ్లాలంటే రాళ్లు తేలిన రోడ్డు..నిత్యం దుమ్ము,ధూళి మధ్య ప్రయాణం..ఇదీ నవాబుపేట మండలంలోని లోకిరేవు గ్రామ విద్యార్థుల దుస్థితి.చదువుకోవాలనే ఆశతో ప్రతిరోజూ నాలుగు కిలోమీటర్లు కాలినడకన ప్రయాణిస్తూ సుమారు 70మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన రహదారే వారి పాలిట శాపంగా మారింది.లోకిరేవు గ్రామానికి చెందిన సుమారు 70మంది విద్యార్థులు ఆరవ తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుకునేందుకు సమీపంలోని లింగంపల్లి ఉన్నత పాఠశాలకు వెళ్తుంటారు.గ్రామం నుంచి పాఠశాలకు వెళ్లడానికి సుమారు 2కిలోమీటర్లు,తిరిగి ఇంటికి రావడానికి మరో 2కిలోమీటర్లు కలిపి ప్రతిరోజూ 4కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించాల్సి వస్తోంది.కనీసం బస్సు సౌకర్యం కూడా లేకపోవడంతో విద్యార్థులకు నిత్యం కష్టాలు తప్పడం లేదు.గ్రామం నుంచి లింగంపల్లి వరకు తారు రోడ్డు నిర్మించేందుకు సుమారు మూడేళ్ల క్రితం కాంట్రాక్టర్ కంకర పరిచారు.అయితే కంకర పరిచిన తర్వాత తారు వేయడం మరిచిపోయి పనులను అసంపూర్తిగా వదిలేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.దీంతో ఏళ్లు గడుస్తున్నా రహదారి పరిస్థితిలో మార్పు రావడం లేదు.రోడ్డుపై కంకర రాళ్లు తేలి ఉండటంతో నడవడానికి కూడా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.సంబంధిత అధికారులు,ప్రజాప్రతినిధులు స్పందించకపోవడంపై తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఇదే రహదారిపై రాకపోకలు సాగించే వాహనాల కారణంగా పెద్ద ఎత్తున దుమ్ము,ధూళి ఎగసిపడుతోంది. కాలినడకన వెళ్లే విద్యార్థుల కళ్లల్లో దుమ్ము పడటంతో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.ఒకవైపు రాళ్లు తేలిన రోడ్డు..మరోవైపు వాహనాల దుమ్ము..వెరసి విద్యార్థుల బడిబాట కష్టాలమయంగా మారింది.ప్రతిరోజూ ఇలాంటి పరిస్థితుల్లో పాఠశాలకు వెళ్లాల్సి రావడంతో విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.విద్యార్థుల ఇబ్బందులను గుర్తించి సంబంధిత అధికారులు తక్షణమే స్పందించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.లోకిరేవు నుంచి లింగంపల్లి ఉన్నత పాఠశాల వరకు బస్సు సౌకర్యం కల్పించడంతో పాటు మూడేళ్లుగా అసంపూర్తిగా ఉన్న రహదారి పనులను పూర్తి చేసి తారు రోడ్డు నిర్మించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.విద్యార్థుల భద్రత,చదువుల విషయంలో నిర్లక్ష్యం చేయకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరుతున్నారు.