BREAKING
సేంద్రీయ సాగును ప్రోత్సహిద్దాం.. చకుముఖి టాలెంట్ టెస్టులో శ్రీవాణి విద్యార్థుల ప్రతిభ శ్రీకాళహస్తి పురపాలక సంఘం ఎన్నికలు ప్రారంభం అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారి వర్షిత్‌కు జగన్‌మోహన్‌రెడ్డి భరోసా కలిసికట్టుగా పని చేద్దాం సర్పంచ్ ఎన్నికల్లో గెలుద్దాం ఈ నెల 19న సీఎం రేవంత్ రెడ్డి సభకు సిద్దిపేటలో ఏర్పాట్లు షురూ! బ్రహ్మాసముద్రం మండలం,ఎరిడికేరా సర్పంచ్ అభ్యర్థి గా గాజుల కుమార్ ఎన్నిక. పీఎం శ్రీ పాఠశాలలో కెరీర్ గైడెన్స్, బాలికా సాధికారత, అడోలసెంట్ క్లబ్ కార్యక్రమాలు రైతుల విద్యుత్ కష్టాలకు తెర.. కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు శ్రీ కాళహస్తి మున్సిపాలిటీ చైర్మన్ కొరకు సర్వే కూరగాయల సాగుతో అదనపు ఆదాయం ఆయిల్‌పామ్ తోటల్లో అంతర పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి పేదల సొంతింటి కల కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం కూటమి విజయంతో రాష్ట్రానికి ఆదర్శం. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ధ్యానంతో మానసిక ప్రశాంతత.. అహింసా జగత్‌ పిరమిడ్‌ ధ్యాన ఆశ్రమం ప్రారంభం శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో మంటలు

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఈనాడు లక్ష్య విద్యార్థుల ఎంపిక

Select Suryaa Now
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఈనాడు లక్ష్య విద్యార్థుల ఎంపిక


ఎమ్మిగనూరు,సూర్య ప్రతినిధి, జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో ఈనాడు లక్ష్య అథ్లెటిక్స్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. అక్టోబర్ 24న నిర్వహించిన అండర్-19 ఎస్‌జీఎఫ్ జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీల్లో విద్యార్థులు పలు విభాగాల్లో ప్రతిభ చాటినట్లు కోచ్ వై. మల్లికార్జున తెలిపారు.
ఈనెల 14, 15 తేదీల్లో పశ్చిమగోదావరి జిల్లా పెదవేగిలో జరగనున్న రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో ఎంపికైన విద్యార్థులు పాల్గొననున్నారు. బాలుర విభాగంలో ఎం. చైతన్య 800 మీటర్ల పరుగు పందెంలో ప్రథమ స్థానం, నిఖిల్ సాయి 400 మీటర్లలో తృతీయ స్థానం, మాలిక్ భాష 200, 400 మీటర్ల పరుగు పందాల్లో తృతీయ స్థానాలు సాధించారు. ఎం. వినయ్ కుమార్ 200, 400 మీటర్ల విభాగాల్లో నాల్గవ స్థానాలు పొందారు.
బాలికల విభాగంలో బి.కె. లక్ష్మి 800, 1500 మీటర్ల పరుగు పందాల్లో ప్రథమ స్థానాలు సాధించగా, కె.బి. ఇందు 1500, 3000 మీటర్ల విభాగాల్లో ద్వితీయ స్థానాలు కైవసం చేసుకున్నారు.రాష్ట్రస్థాయి పోటీల్లోనూ ఇదే ఉత్సాహంతో రాణించి పతకాలు సాధించి జిల్లాకు, ఎమ్మిగనూరు పట్టణానికి, సంస్థకు మంచి పేరు తీసుకురావాలని కోచ్ వై. మల్లికార్జున విద్యార్థులను అభినందించి ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో ఈనాడు లక్ష్య అథ్లెటిక్స్ కోచ్ వై. మల్లికార్జునతో పాటు పలువురు పాల్గొన్నారు.
*A. R. శరత్ కుమార్, సూర్య ప్రతినిధి, ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లా.*