BREAKING
భక్తిశ్రద్ధలతో పోచమ్మ బోనాలు స్థలాలు కోల్పోయిన బాధితులకు ఎమ్యెల్యే ఆర్ధిక సహాయం మాజీ మంత్రి శ్రీ శత్రుచర్ల విజయరామరాజు గారు కన్నుమూత పూతలపట్టులో యస్ ఏ ఏ యన్ యస్ కార్యక్రమం ప్రారంభం – చిన్న పిల్లల్లో న్యూమోనియా నివారణే లక్ష్యం 24 గంటల్లో ప్రజా సమస్యకు పరిష్కారం! రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఈనాడు లక్ష్య విద్యార్థుల ఎంపిక సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ నెల్లూరు జిల్లాలో స్థానిక సమరం.. పల్లెపల్లెనా రాజకీయ వేడి! మంత్రి లోకేష్ సమక్షంలో తొలిరోజు పెట్టుబడుల ప్రవాహం : రూ. 1,57,607 కోట్ల విలువైన 35 అవగాహనా ఒప్పందాలు జనగణనను సమర్థవంతంగా పూర్తి చేయాలి: కమిషనర్ చల్లా ఓబులేసు రాళ్ల రోడ్డుపై విద్యార్థుల నరకయాతన మొక్కుబడిగా మండల సర్వసభ్య సమావేశం న్యుమోనియా నివారణతోనే బాల్యానికి భరోసా - డా. మానస మగ్దుంపల్లి గ్రామంలో రీ సర్వే 22-ఎ దరఖాస్తులను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలి

మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి

Select Suryaa Now
మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి
సూర్య ఆలూరు : ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆలూరు మండలం కల్లెడ గ్రామంలో పలు కుటుంబాలను పరామర్శించి, మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ సందర్భంగా ఇటీవల వెల్మల్ – ఆలూరు మధ్య జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సాగర్ల చేతన్ కుటుంబాన్ని పరామర్శించారు. అదేవిధంగా అనారోగ్యంతో మృతి చెందిన బీజేపీ కార్యకర్త సుక్కి విజయ్ తల్లిగారి కుటుంబాన్ని, మరో బీజేపీ కార్యకర్తలు ఆమందు సాగర్, ఆమందు శ్రీనుల తల్లిగారు అనారోగ్యంతో మృతి చెందడంతో వారి కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి మనోధైర్యం కల్పించారు. ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కల్లెడ గ్రామ సర్పంచ్ ప్రళయ్ తేజ్, వార్డు సభ్యులు రొడ్డ వంశీకృష్ణ, బూత్ అధ్యక్షులు అర్జీత్, అరుణ్, మధు, మండల అధ్యక్షుడు సూర శ్రీకాంత్, సీనియర్ నాయకులు నరేందర్ సార్, బుమన్నా, నాగన్న, యువ నాయకులు సిరికొండ సాయికుమార్, కార్యకర్తలు అశోక్, దినేష్, ప్రణయ్, అఖిలేష్ తదితర మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.