BREAKING
క్షేత్రస్థాయిలో అత్యంత అప్రమత్తంగా, పకడ్బందీగా జన గణన సర్వే. భక్తిశ్రద్ధలతో పోచమ్మ బోనాలు స్థలాలు కోల్పోయిన బాధితులకు ఎమ్యెల్యే ఆర్ధిక సహాయం మాజీ మంత్రి శ్రీ శత్రుచర్ల విజయరామరాజు గారు కన్నుమూత పూతలపట్టులో యస్ ఏ ఏ యన్ యస్ కార్యక్రమం ప్రారంభం – చిన్న పిల్లల్లో న్యూమోనియా నివారణే లక్ష్యం 24 గంటల్లో ప్రజా సమస్యకు పరిష్కారం! రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఈనాడు లక్ష్య విద్యార్థుల ఎంపిక సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ నెల్లూరు జిల్లాలో స్థానిక సమరం.. పల్లెపల్లెనా రాజకీయ వేడి! మంత్రి లోకేష్ సమక్షంలో తొలిరోజు పెట్టుబడుల ప్రవాహం : రూ. 1,57,607 కోట్ల విలువైన 35 అవగాహనా ఒప్పందాలు జనగణనను సమర్థవంతంగా పూర్తి చేయాలి: కమిషనర్ చల్లా ఓబులేసు రాళ్ల రోడ్డుపై విద్యార్థుల నరకయాతన మొక్కుబడిగా మండల సర్వసభ్య సమావేశం న్యుమోనియా నివారణతోనే బాల్యానికి భరోసా - డా. మానస మగ్దుంపల్లి గ్రామంలో రీ సర్వే

వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహ ధ్వంసం దుర్మార్గమైన చర్య, దోషులను కఠినంగా శిక్షించాలి

Select Suryaa Now
వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహ ధ్వంసం దుర్మార్గమైన చర్య, దోషులను కఠినంగా శిక్షించాలి
సూర్య నస్పూర్ : మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చింతగుంట గ్రామంలో శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి మునిగంటి శ్రీనివాస్ చారి అన్నారు. గురువారం నస్పూర్ శ్రీరాంపూర్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మహాసభ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శుల  సూచనల మేరకు జిల్లా, మండల స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. కాలజ్ఞానకర్తగా, సంఘ సంస్కర్తగా, జగద్గురువుగా విశ్వప్రసిద్ధి చెందిన వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేయడం విశ్వబ్రాహ్మణులతో పాటు సమస్త హిందువుల మనోభావాలను దెబ్బతీసే హేయమైన చర్యగా అభివర్ణించారు. ఈ ఘటనకు పాల్పడిన దుండగులను ప్రభుత్వం, ఉన్నతాధికారులు వెంటనే గుర్తించి అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కర్ణకంటి నర్సింహాచారి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ తెలికుంట్ల రాజాచారి, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ కొండపర్తి రామ్మోహన్ చారి, బీసీ సమాజ్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు నరెడ్ల శ్రీనివాస్, పలువురు నాయకులు పాల్గొన్నారు.