BREAKING
నాలాల పునరుద్ధరణకై మున్సిపల్ ముట్టడిని విజయవంతం చేద్దాం..సోమిశెట్టి దశరథం పవన్ కళ్యాణ్‌తో మరో సినిమాపై దిల్ రాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ ప్రొడ్యూసర్! ఎండపల్లి పాఠశాలలో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌లో పత్తికి 8810 ధర అక్షర స్కూల్లో ముందస్తుగా బాలల దినోత్సవ వేడుకలు ప్రారంభోత్సవానికి సిద్ధంగా పబ్లిక్ టాయిలెట్లు ఎర్రావారిపాలెం మండలంలో టీడీపీకి షాక్‌..! తూప్రాన్ గీత స్కూల్లో చాచాజీ ఆకారంలో విద్యార్థులు ఎండపల్లి రహదారుల అభివృద్ధికి రూ.55 లక్షలు మంజూరు చేయాలి రబీ సాగులో నీటి లభ్యతకు అనుగుణంగా పంటల ప్రణాళిక రూపొందించాలి ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నిరంతర పోరాటం *గనుగాపూర్ పుణ్యక్షేత్రానికి మహా పాదయాత్ర ప్రారంభం భక్తులతో కలిసి పాదయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే* *రైతులకు వ్యవసాయ విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా చూడాలి* భారత్ సమ్మిట్ లో పాల్గొన్న సుడా మాజీ చైర్మన్

ఇంటర్మీడియట్ విద్యా విధాన విలీన నిర్ణయాన్ని పునఃపరిశీలించాలి: బీఆర్ఎస్వీ మునుగోడు నియోజకవర్గ అధ్యక్షుడు నలపరాజు రమేష్

Select Suryaa Now
ఇంటర్మీడియట్ విద్యా విధాన విలీన నిర్ణయాన్ని పునఃపరిశీలించాలి: బీఆర్ఎస్వీ మునుగోడు నియోజకవర్గ అధ్యక్షుడు నలపరాజు రమేష్

ఇంటర్మీడియట్ విద్యా విధాన విలీన నిర్ణయాన్ని పునఃపరిశీలించాలి: బీఆర్ఎస్వీ మునుగోడు నియోజకవర్గ అధ్యక్షుడు నలపరాజు రమేష్

మునుగోడు,మేజర్ న్యూస్:

తెలంగాణ రాష్ట్రంలో 2027-28 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ విద్యా విధానాన్ని రద్దు చేసి, 10+2 విధానంలో భాగంగా ఇంటర్మీడియట్ విద్యను పాఠశాల విద్యలో విలీనం చేయాలనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని బీఆర్ఎస్వీ మునుగోడు నియోజకవర్గ అధ్యక్షుడు నలపరాజు రమేష్ గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. 
దశాబ్దాలుగా తెలంగాణ విద్యావ్యవస్థలో ప్రత్యేక గుర్తింపు కలిగిన ఇంటర్మీడియట్ విద్యా విధానంలో ఇంత కీలకమైన మార్పులు తీసుకురావడానికి ముందు విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు, విద్యారంగ నిపుణులతో విస్తృతంగా చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకుండా క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.
ఈ నిర్ణయం అమలైతే గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల భవిష్యత్తు ఏమిటని ప్రశ్నించారు. ప్రస్తుతం ఇంటర్మీడియట్ కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకుల పరిస్థితి ఏమిటన్నారు. MPC, BiPC, CEC, MEC వంటి విభిన్న గ్రూపుల బోధనలో నాణ్యతను ఎలా కొనసాగిస్తారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని కోరారు. కేవలం CBSE, ICSE పాఠశాలల తరహాలో విద్యా విధానాన్ని మార్చడం వల్లే నాణ్యమైన విద్య అందుతుందని భావించడం సరైంది కాదన్నారు. విద్యా సంస్కరణలు విద్యార్థులకు మరిన్ని అవకాశాలు కల్పించేలా ఉండాలే తప్ప, ఇప్పటికే అందుబాటులో ఉన్న విద్యావ్యవస్థపై అనిశ్చితిని సృష్టించేలా ఉండకూడదన్నారు.  విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకుల అభిప్రాయాలను సేకరించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.
విద్యార్థుల భవిష్యత్తు రాజకీయ ప్రయోగాలకు వేదిక కాకూడదని, తెలంగాణ విద్యార్థులందరికీ నాణ్యమైన విద్యతో పాటు సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం కావాలని ఆయన స్పష్టం చేశారు.

కె ఇంద్రసేనారెడ్డి మేజర్ న్యూస్ మునుగోడు, నల్గొండ జిల్లా.