BREAKING
వరి వద్దు ఆరుతడి పంటలే మేలు ఎంపీడీవో చిన్నారెడ్డి నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు ప్రభుత్వ హాస్టళ్ల విద్యార్థులకు దోమతెరల పంపిణీ.. మల్లయ్య కొండ శివునికి కార్తీక పౌర్ణమి ప్రత్యేక పూజలు.. పాలమూరు సర్పంచ్ అభ్యర్థిగా ఆదిలక్ష్మి మండల ప్రత్యేక అధికారి జగదీష్. చల్మెడలో గ్రామసభ.. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, శుభకార్యాల్లో పాల్గొన్న మాద్రి పృథ్వీరాజ్ రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి: మార్కెట్ కమిటీ చైర్మన్ కొత్తపల్లి విజయభాస్కర్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం.. మాదకద్రవ్యాల నిర్మూలనకై చర్యలు… బండ్లగూడకు వెళ్లే రెండు ప్రధాన రహదారులను 30 అడుగుల వెడల్పుతో నిర్మించాలి! పంటల మార్పిడి, నీటి సంరక్షణపై రైతులకు అవగాహన కార్యక్రమం హిందూపురంలో సెప్టెంబర్ 24న ఆనంద మార్గ ఆధ్యాత్మిక శిబిరం మార్కెట్ కమిటీ చైర్మన్ గా గుర్రాల మల్లేశం ..

ఎండపల్లి పాఠశాలలో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

Select Suryaa Now
ఎండపల్లి పాఠశాలలో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం
 సూర్య ఎండపల్లి ;ఎండపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు దాశెట్టి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ముందస్తు బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఒక్కరోజు ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ తమ ప్రతిభను చాటుకున్నారు. నాలుగో తరగతి విద్యార్థి గౌరీ లక్షత్ వర్మ తండ్రి చిరంజీవి పండ్లు పంపిణీ చేయగా, ఐదో తరగతి విద్యార్థిని దాసరి అనుశ్రీ తండ్రి, వార్డు సభ్యుడు దాసరి మల్లేశం బహుమతులు అందజేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సర్పంచ్ మారం సునీత జలంధర్ రెడ్డి విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించగా, ప్రధానోపాధ్యాయులు దాశెట్టి రవీందర్ రెడ్డి బాలల దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నాగం రమేష్, మొగురం శ్రీధర్, పరిసే రాజశేఖర్, సుబ్బని తిరుపతి, రాజోజి శ్రీదేవి, ప్రాథమిక పూర్వ విద్యా బోధకురాలు సంధ్య, పుష్పలత, సహాయకుడు గణేష్, పాఠశాల శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.