BREAKING
మల్లయ్య కొండ శివునికి కార్తీక పౌర్ణమి ప్రత్యేక పూజలు.. పాలమూరు సర్పంచ్ అభ్యర్థిగా ఆదిలక్ష్మి మండల ప్రత్యేక అధికారి జగదీష్. చల్మెడలో గ్రామసభ.. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, శుభకార్యాల్లో పాల్గొన్న మాద్రి పృథ్వీరాజ్ రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి: మార్కెట్ కమిటీ చైర్మన్ కొత్తపల్లి విజయభాస్కర్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం.. మాదకద్రవ్యాల నిర్మూలనకై చర్యలు… బండ్లగూడకు వెళ్లే రెండు ప్రధాన రహదారులను 30 అడుగుల వెడల్పుతో నిర్మించాలి! పంటల మార్పిడి, నీటి సంరక్షణపై రైతులకు అవగాహన కార్యక్రమం హిందూపురంలో సెప్టెంబర్ 24న ఆనంద మార్గ ఆధ్యాత్మిక శిబిరం మార్కెట్ కమిటీ చైర్మన్ గా గుర్రాల మల్లేశం .. రామాయంపేటలో 8 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ టీజీ సాంఘికసంక్షేమ వసతి కళాశాలలో తహసీల్దార్ రజనీకుమారి ఆకస్మిక తనిఖీ ఎరువుల దుకాణాల్లో వరి విత్తనాల విక్రయాలు చేయొద్దు

నాలాల పునరుద్ధరణకై మున్సిపల్ ముట్టడిని విజయవంతం చేద్దాం..సోమిశెట్టి దశరథం

Select Suryaa Now
నాలాల పునరుద్ధరణకై మున్సిపల్ ముట్టడిని విజయవంతం చేద్దాం..సోమిశెట్టి దశరథం
సూర్య రాజన్న సిరిసిల్ల ;;సిరిసిల్ల పట్టణంలోని కొత్తచెరువు నాలాలను పునరుద్ధరించాలని,పూర్వపు నాలాలను గుర్తించి చెరువు నీళ్లు యథావిధిగా పోయేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్యాలయం ఎదుట నేడు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టనున్నట్లు ఏఐఎఫ్టీయూ న్యూ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సోమిశెట్టి దశరథం తెలిపారు. శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ శ్రీనగర్ కాలనీ,శాంతినగర్ ప్రజల ఇబ్బందులు పరిష్కరించాలని,తాత్కాలిక కచ్చా కాలువ రద్దు చేయాలని,సర్వే నంబర్ 39లోని రోడ్డం నాలా తెరిచి సహజ నాలాల ద్వారా నీరు పోయేలా చేయాలని,చంద్రంపేట ఎక్స్ రోడ్ నుంచి మొదటి బైపాస్‌ను కలిపే రోడ్డు పనులు పూర్తి చేయాలని,సర్వే నంబర్లు 71, 72లలో విధించిన నిషేధం,22ఏ పేదల ప్లాట్లపై నిషేధం ఎత్తివేయాలని,మున్సిపాల్‌ కు లేఔట్‌గా వదిలిన సుమారు 10 గుంటల భూమిని స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని నాయకులు కొండ శ్యామ్,ఆకన సత్తయ్య,బొల్లబత్తిని ఎల్లయ్య,గుజ్జ దేవదాసులు పిలుపునిచ్చారు.