BREAKING
మల్లయ్య కొండ శివునికి కార్తీక పౌర్ణమి ప్రత్యేక పూజలు.. పాలమూరు సర్పంచ్ అభ్యర్థిగా ఆదిలక్ష్మి మండల ప్రత్యేక అధికారి జగదీష్. చల్మెడలో గ్రామసభ.. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, శుభకార్యాల్లో పాల్గొన్న మాద్రి పృథ్వీరాజ్ రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి: మార్కెట్ కమిటీ చైర్మన్ కొత్తపల్లి విజయభాస్కర్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం.. మాదకద్రవ్యాల నిర్మూలనకై చర్యలు… బండ్లగూడకు వెళ్లే రెండు ప్రధాన రహదారులను 30 అడుగుల వెడల్పుతో నిర్మించాలి! పంటల మార్పిడి, నీటి సంరక్షణపై రైతులకు అవగాహన కార్యక్రమం హిందూపురంలో సెప్టెంబర్ 24న ఆనంద మార్గ ఆధ్యాత్మిక శిబిరం మార్కెట్ కమిటీ చైర్మన్ గా గుర్రాల మల్లేశం .. రామాయంపేటలో 8 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ టీజీ సాంఘికసంక్షేమ వసతి కళాశాలలో తహసీల్దార్ రజనీకుమారి ఆకస్మిక తనిఖీ ఎరువుల దుకాణాల్లో వరి విత్తనాల విక్రయాలు చేయొద్దు

ప్రారంభోత్సవానికి సిద్ధంగా పబ్లిక్ టాయిలెట్లు

Select Suryaa Now
ప్రారంభోత్సవానికి సిద్ధంగా పబ్లిక్ టాయిలెట్లు
సూర్య, హుజురాబాద్:హుజురాబాద్ పట్టణంలో ప్రజల సౌకర్యార్థం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్మించిన పబ్లిక్ టాయిలెట్లు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. హుజురాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి, మైదానం, గ్రంథాలయం తదితర ప్రదేశాల వద్ద ప్రజలకు సౌకర్యం కలిగించడం కోసం స్వచ్ఛ భారత్ మిషన్ నిధుల నుండి మున్సిపల్ ఆధ్వర్యంలో అధునాతనమైన, అందమైన పబ్లిక్ టాయిలెట్లను నిర్మించారు. స్వచ్ఛభారత్ మిషన్ నిధుల నుండి 20 లక్షల రూపాయలు మంజూరు కాగా గ్రంథాలయం వద్ద ఒకటి, మున్సిపాలిటీ వద్ద ఒకటి టాయిలెట్లను నిర్మించారు. గతంలో ఇదే ప్రాంతంలో గత మున్సిపల్ పాలకవర్గం ఆధ్వర్యంలో టన్నెల్ తో టాయిలెట్లను నిర్మించారు. కాగా అవి నిర్మించిన తర్వాత కొన్నాళ్లు బాగా ఉన్నప్పటికీ, వాటిని శుభ్రం చేయడానికి వ్యక్తులు లేకపోవడంతో అది పూర్తిగా నిరుపయోగంగా మారింది. ఎలాంటి పర్యవేక్షణ లేకపోవడంతో ప్రారంభించిన కొన్నేళ్లలోనే అది ప్రజలకు అక్కరకు రాకుండా పోయింది. అలా ప్రజాధనం వృధా అయింది. ప్రస్తుతం మున్సిపల్ ఆధ్వర్యంలో అందమైన, అధునాతనమైన పబ్లిక్ టాయిలెట్లను నిర్మించారు. కానీ వాటి నిర్వహణ ఎవరికి ఇస్తారు ఇంకా తెలియ రాలేదు. పే అండ్ యూస్ పద్ధతిలో పెడితే ఈ ప్రాంతంలో ప్రజల నుండి వ్యతిరేకత వచ్చే అవకాశముంది. టాయిలెట్ల నిర్వహణకు వ్యక్తిని నియమించకపోతే గతంలో మాదిరిగానే అందమైన పబ్లిక్ టాయిలెట్లు పర్యవేక్షణ లేక  వృధాగా మారే అవకాశం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.  సంబంధిత అధికారులు, పాలకవర్గం స్పందించి నూతన పబ్లిక్ టాయిలెట్లను ప్రారంభించే ముందే దాని నిర్వహణ గురించి ఆలోచన చేసిన తర్వాత ప్రారంభించాలని ప్రజలు కోరుతున్నారు. లేనిపక్షంలో అది వృధాగా మారి ప్రజాధనం వృధాగా మారే అవకాశం ఉంటుంది అని అంటున్నారు.
 
-- ప్రజల కోరిక మేరకు...
 
ప్రజల సౌకర్యార్థం పబ్లిక్ టాయిలెట్లు నిర్మించాలని,  ప్రజల కోరిక మేరకు గ్రంథాలయం వద్ద అధునాతనమైన టాయిలెట్లను నిర్మించినట్లు మున్సిపల్ ఏఈ నరేష్ తెలిపారు. పబ్లిక్ టాయిలెట్ల విషయంలో అన్ని రకాలుగా ఆలోచించి ప్రజలకు మేలు చేసే విధంగా పనులు పూర్తి చేసి త్వరలోనే ప్రజలకు అందుబాటులో తెస్తామని ఏఈ తెలిపారు.