చల్ల రాజా ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి జన్మదిన వేడుకలు
ఘనంగా కేక్ కటింగ్ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు
ప్రొద్దుటూరు మేజర్ న్యూస్ : ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి 85వ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని గురువారం పట్టణంలో పలుచోట్ల అభిమానులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఇందులో భాగంగా స్థానిక అన్వర్ థియేటర్ వద్ద 27వ వార్డు కౌన్సిలర్, పట్టణ టీడీపీ అధ్యక్షుడు చల్లా రాజగోపాల్ యాదవ్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా కేక్ కటింగ్, అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ ప్రతిపాదిత చైర్మన్ నంద్యాల రాఘవరెడ్డి కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రజలకు భోజనాన్ని పంపిణీ చేశారు. ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ఆయురారోగ్యాలతో, మరింత కాలం ప్రజలకు సేవలందించాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ప్రజలకు అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న నాయకుడని పేర్కొన్నారు. ఆయన జన్మదినాన్ని సేవా కార్యక్రమాలతో జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డు ఇన్‌చార్జి చైర్మన్ పట్నం లక్ష్మణ్, టీడీపీ కౌన్సిలర్ వంగనూరు మురళీధర్ రెడ్డి, 26వ వార్డు ఇన్‌చార్జి నూరీ, జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి ఘంటసాల వెంకటేశ్వర్లు, శివాలయం పాలకమండలి సభ్యుడు బాబు, చల్లా రవిశంకర్ యాదవ్, మూరబోయిన శ్రీనివాస్ యాదవ్, చింతల రాఘవేంద్ర యాదవ్, బంగి శివప్రసాద్, కర్ణ యాదవ్, రామచంద్రరాజు, హరి, పూల భాష, నల్లం రవిశంకర్, ఏసునాథరెడ్డి, నేలటూరు సంజీవరాయుడు యాదవ్ తదితర టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
- షేక్ మహమ్మద్ రఫీ ప్రొద్దుటూరు వైఎస్సార్ కడప జిల్లా