telangana
మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన కోనేరు కోనప్ప
సూర్య,పెంచికల్‌పేట్: మండలంలో ఎల్కపల్లి గ్రామానికి చెందిన డొబ్బల బుజ్జి బుధవారం రోజు జ్వరంతో మృతి చెందడంతో విషయం తెలుసుకున్న కోనేరు కోనప్ప గురువారం రోజు ఆమె కుటుంబాన్ని పరామర్శించారు. బుజ్జి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఆయన, మృతురాలి భర్త రాములు, కుమారులు కళ్యాణ్, కౌశిక్‌తో పాటు కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు. బుజ్జి మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండలానికి చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు.