andhrapradesh
నగరంలో కోలాట ప్రదర్శన
నగరం, మేజర్ న్యూస్:
మండల కేంద్రమైన నగరం గౌడపాలెం రామాలయం వద్ద శ్రీ గణేష్ కోలాటం భజన బృందం నగరం వారిచే కోలాట ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో నగరం గ్రామ గౌడ పెద్దలు, నగరం గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని తిలకించి, కళాకారులను అభినందించినారు. నగరం గౌడపాలెం చెందిన 50 మంది కళాకారులు గత 40 రోజులుగా కోలాటం నేర్చుకుని, ప్రదర్శించారు.