ఒంగోలు, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తనిఖీలు
ఒంగోలు, మేజర్‌న్యూస్ :
డైరెక్టర్ జనరల్, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, విజయవాడ వారి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా మరియు మార్కాపురం జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఒంగోలు, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు రెండు బృందాలుగా ఏర్పడి ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలంలోని బియ్యం, వంట నూనెలు మరియు నిత్యావసర వస్తువుల దుకాణాలను తనిఖీ చేయడం జరిగింది.
తనిఖీలు నిర్వహించిన వ్యాపార సంస్థలు:
1. గ్రంధే శరత్ బాబు: కొండండ రామస్వామి టెంపుల్ రోడ్, సంతనూతలపాడు – బియ్యం హోల్‌సేల్ వ్యాపారం.
2. దత్త సాయి రైస్ ట్రేడర్స్: పెద్దబజార్ రోడ్, సంతనూతలపాడు – బియ్యం వ్యాపారం.
3. శ్రుతి ట్రేడర్స్: కొండండ రామస్వామి టెంపుల్ రోడ్, సంతనూతలపాడు – వంట నూనెల వ్యాపారం.
4. వెంకటేశ్వర ఆయిల్ ట్రేడర్స్ : పెద్దబజార్ రోడ్, సంతనూతలపాడు - వంట నూనెల వ్యాపారం.
ఈ తనిఖీలలో అధికారులు ప్రభుత్వం నిర్దేశించిన ధరల కంటే అధిక ధరలకు వస్తువులను విక్రయించడం, కొన్ని ఉత్పత్తులపై తప్పనిసరిగా ఉండవలసిన డిక్లరేషన్లు లేకపోవడం మరియు ఇతర నిబంధనల ఉల్లంఘనలు గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలో సంబంధిత వ్యాపారులపై Sec. 15 of Legal Metrology Act-2009 ప్రకారం మొత్తం 5 కేసులు నమోదు చేసి సుమారు రూ. 52,500/- విలువైన సరుకుల యొక్క అమ్మకాలను నిలుపుదల చేయడం జరిగినది. అదేవిధముగా, వెంకటేశ్వర ఆయిల్ ట్రేడర్స్ పై 6(A) కేసు నమోదు చేసి సుమారు రూ. 3,00,000/- విలువ గల 1930 లీటర్స్ ఆయిల్ ను సీజ్ చేయడం జరిగినది. ఈ సందర్భంగా వ్యాపారులకు తెలియజేయునది ఏమనగా, ప్రభుత్వం నిర్దేశించిన ధరల కంటే అధిక ధరలకు నిత్యావసర వస్తువులను విక్రయించినట్లయితే సంబంధిత చట్టాల ప్రకారం కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. అదేవిధంగా, నిత్యావసర వస్తువులను అక్రమంగా నిల్వ చేయడం, కృత్రిమ కొరత సృష్టించడం లేదా అధిక ధరలకు విక్రయించేందుకు ప్రయత్నించడం వంటి చర్యలకు పాల్పడిన వారిపై కూడా కఠినమైన చర్యలు తీసుకోబడతాయి.
ఈ తనిఖీలలో పాల్గొన్న అధికారులు:
1. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు.
2. లీగల్ మెట్రాలజీ శాఖ అధికారులు.
3. పౌర సరఫరాల శాఖ అధికారులు.
4. కమర్షియల్ టాక్స్ అధికారులు.
5. అగ్రికల్చర్ మార్కెటింగ్ అధికారులు.