BREAKING
ఐదు బంతుల్లో ఐదు వికెట్లు తీసిన సంచలన పేసర్‌కు పిలుపు.. భారత్‌తో ఆఖరి రెండు వన్డేలకు కివీస్ జట్టు ప్రకటన! ఐపీఎల్‌లో 12 జట్లు, రూ.150 కోట్ల పర్స్‌.. విస్తరణ వార్తలపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా సంచలన క్లారిటీ! ఘనంగా ముగిసిన జాతీయ వర్క్ షాప్ మాంస ఉత్పత్తులతో స్టార్టప్ లకు మార్గం: డా. బి.శోభామణి కెప్టెన్‌గా అరంగేట్రంలో సెంచరీ.. సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు కొట్టేందుకు శ్రేయస్ అయ్యర్ సిద్ధం! గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ జగదీష్ ఆదహళ్లి అచ్చొచ్చిన మైదానంలో రోహిత్ శర్మ రికార్డులు.. నాలుగో వన్డేలో అదరగొట్టేందుకు సిద్ధం! ఐక్యూఏసీ డైరెక్టర్ గా ప్రొఫెసర్ రమేష్ బాబు ఏసీసీ రైజింగ్ స్టార్స్ ఆసియా కప్.. శ్రీలంక జట్టు ప్రకటన, కెప్టెన్‌గా పవన్ రత్నాయకే! ఉపాధ్యాయ వృత్తికే-కళంకం అండర్-19 ఆసియా కప్ సెమీస్‌లో చెలరేగిన సెహ్వాగ్‌ తనయుడు.. అర్ధశతకంతో అదరగొట్టిన ఆర్యవిర్! ‎ఆరోగ్యాలనిచ్చే ' తాయిలం' సంపదలను పెంచే ఆకు- తమలపాకు జనాలకు శుభాలనిచ్చే తమలపాకు. నంబూరు–ఎర్రుపాలెం రైల్వే లైన్ భూసమీకరణ ప్రక్రియ వేగవంతం చేయాలి జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా విద్యార్థులకు అభినందన ఒకవైపు గుంతలు బాబోయ్.. మరోవైపు దుర్వాసన! పూతలపట్టు నుండి పోలవరం వెళ్లే రోడ్డు పరిస్థితి ఇది.. ఇటుపక్క వెళ్లలేకపోతున్నాం మొర్రో అంటున్న వాహనదారులు, స్థానికులు అరంగేట్ర టెస్టులో సంచలనం సృష్టించిన పాకిస్తాన్ బౌలర్ సాకిబ్ ఖాన్.. అరుదైన రికార్డు నమోదు!

ఫీజులు చెల్లించాలని వేధింపులు

Select Suryaa Now
ఫీజులు చెల్లించాలని వేధింపులు

 

 

 

ఓ విద్యార్థి మృతి, ప్రాణాపాయ స్థితిలో మరో విద్యార్థి 

 

ఎస్ వి సెట్ ఇంజనరింగ్ కళాశాల ఎదుట విద్యార్థుల నిరసన

 

చిత్తూరు ప్రతినిధి మేజర్ న్యూస్: ఫీజులు చెల్లించాలని  కళాశాల యాజమాన్యం చేస్తున్న వేధింపులు తట్టుకోలేక విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటన గురువారం చిత్తూరు నగరం లోని ఎస్ వి సెట్ ఇంజనీరింగ్ కళాశాల లో చోటుచేసుకుంది. కళాశాల యాజమాన్యం వేధింపులను నిరసిస్తూ ఇంజనీరింగ్ కళాశాల ఎదుట జాతీయ రహదారి పై దాదాపు మూడు గంటలకు పైగా విద్యార్థులు బయటాయించారు. యాజమాన్యం సమాధానం చెప్పాలంటూ ఇంజనీరింగ్ కళాశాల ప్రధాన ద్వారాన్ని బద్దలు కొట్టుకుని కళాశాల ప్రధాన కార్యాలయం ముందు బైఠాయించిన విద్యార్థులను చిత్తూరు డీఎస్పీ వెంకటనారాయణ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బలగాలు చెదరగొట్టాయి.

  ఎస్ వి సెట్ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం ఇంజనీరింగ్ విద్యార్థులను కళాశాల, పరీక్ష ఫీజులు చెల్లించాలంటూ వేధింపులకు గురిచేయడంతో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న స్రవంతి రెండు రోజుల క్రితం ఇదే కళాశాలకు చెందిన నర్సింగ్ కళాశాల ఆవరణం లోని వసతి గృహంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు విద్యార్థుల ఆరోపిస్తున్నారు. ఇందులో ఏ మాత్రం నిజం లేదని వాదిస్తోంది. నిజా నిజాలు పోలీసులు విచారణలో తేల్చాల్సి ఉంది. బుధవారం రాత్రి ఎస్ వి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న అన్నమయ్య జిల్లా రాయచోటి కి చెందిన మౌనిక (18) ఇంజనీరింగ్ కళాశాల సమీపం లోని గణేష్ మేనేజ్మెంట్ కళాశాల విద్యార్థుల వసతి గృహంలో నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కేవలం ఎస్ వి సెట్ కళాశాల యాజమాన్యం ఫీజుల చెల్లింపు విషయంలో ఒత్తిడి తేవడం తోనే మౌనిక ఆత్మహత్యకు పాల్పడ్డారంటూ చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మౌనిక చికిత్స పొందుతోంది. ఫీజులు చెల్లించాలంటూ కళాశాల యాజమాన్యం వేధింపుల కారణంగానే ఆరు నెలల కాలంలో ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారంటూ విద్యార్థులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎస్ వి సెట్ ఇంజనీరింగ్ కళాశాల ఎదుట జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు…

   దాదాపు మూడు గంటల పాటు తిరుపతి-వేలూరు జాతీయ రహదారిని దిగ్బంధనం చేశారు. కన్వీనర్ కోటా కింద ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థుల ఫీజులు చెల్లించాలంటూ కళాశాల యాజమాన్యం తీవ్ర ఒత్తిడి చేస్తోందని ఒక్కరోజు ఫీజు చెల్లించడం ఆలస్యం అయితే 5000 రూపాయలు అపరాధ రుసుము కింద చెల్లించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ విషయాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన ఎలాంటి ఫలితం లేదన్నారు. ఓవైపు ఫీజుల చెల్లించాలంటూ కళాశాల యాజమాన్యం వేధింపులు, అపరాధ రసముల కోసం తల్లిదండ్రులను ఇబ్బందులు పెట్టాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అధిక ఫీజుల వసూళ్లు, విద్యార్థులపై ఒత్తిడి, విద్యార్థుల ఆత్మహత్యకు గల కారణాలు, అపరాధ రుసుములపై విచారణ కమిటీ ఏర్పాటు చేసి న్యాయం చేస్తామని చిత్తూరు డిఎస్పి విద్యార్థులకు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

 

ఉమాశంకర్ చిత్తూరు స్టాఫ్ రిపోర్టర్.