BREAKING
జాతీయ స్థాయి పోటీలకు ఎస్పీడబ్ల్యూ విద్యార్థిని ఐదు బంతుల్లో ఐదు వికెట్లు తీసిన సంచలన పేసర్‌కు పిలుపు.. భారత్‌తో ఆఖరి రెండు వన్డేలకు కివీస్ జట్టు ప్రకటన! ఐపీఎల్‌లో 12 జట్లు, రూ.150 కోట్ల పర్స్‌.. విస్తరణ వార్తలపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా సంచలన క్లారిటీ! ఘనంగా ముగిసిన జాతీయ వర్క్ షాప్ మాంస ఉత్పత్తులతో స్టార్టప్ లకు మార్గం: డా. బి.శోభామణి కెప్టెన్‌గా అరంగేట్రంలో సెంచరీ.. సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు కొట్టేందుకు శ్రేయస్ అయ్యర్ సిద్ధం! గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ జగదీష్ ఆదహళ్లి అచ్చొచ్చిన మైదానంలో రోహిత్ శర్మ రికార్డులు.. నాలుగో వన్డేలో అదరగొట్టేందుకు సిద్ధం! ఐక్యూఏసీ డైరెక్టర్ గా ప్రొఫెసర్ రమేష్ బాబు ఏసీసీ రైజింగ్ స్టార్స్ ఆసియా కప్.. శ్రీలంక జట్టు ప్రకటన, కెప్టెన్‌గా పవన్ రత్నాయకే! ఉపాధ్యాయ వృత్తికే-కళంకం అండర్-19 ఆసియా కప్ సెమీస్‌లో చెలరేగిన సెహ్వాగ్‌ తనయుడు.. అర్ధశతకంతో అదరగొట్టిన ఆర్యవిర్! ‎ఆరోగ్యాలనిచ్చే ' తాయిలం' సంపదలను పెంచే ఆకు- తమలపాకు జనాలకు శుభాలనిచ్చే తమలపాకు. నంబూరు–ఎర్రుపాలెం రైల్వే లైన్ భూసమీకరణ ప్రక్రియ వేగవంతం చేయాలి జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా విద్యార్థులకు అభినందన ఒకవైపు గుంతలు బాబోయ్.. మరోవైపు దుర్వాసన! పూతలపట్టు నుండి పోలవరం వెళ్లే రోడ్డు పరిస్థితి ఇది.. ఇటుపక్క వెళ్లలేకపోతున్నాం మొర్రో అంటున్న వాహనదారులు, స్థానికులు

భోగాపురం ఎంపీపీ పీఠంపై మళ్లీ ఉత్కంఠ!

Select Suryaa Now
భోగాపురం ఎంపీపీ పీఠంపై మళ్లీ ఉత్కంఠ!

* స్వతంత్రుల మద్దతే కీలకం.. 
* కూటమి సమీకరణాలపై ఆసక్తికర చర్చ
* టీడీపీ, జనసేన వ్యూహాలపైనే అందరి దృష్టి.. 
* పోలిపల్లి లక్ష్మి పేరు తెరపైకి!

భోగాపురం, నవంబర్ 13, (మేజర్ న్యూస్): భోగాపురం మండల రాజకీయాల్లో ఎంపీపీ పీఠం చుట్టూ మరోసారి ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసు కుంటున్నాయి. మండల ప్రాదేశిక ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటికీ, మండల పరిషత్ అధ్యక్ష పదవి ఎవరిని వరిస్తుందన్నది ఇంకా స్పష్టతకు రాలేదు. ఐదేళ్లకోసారి ఎంపీపీ ఎన్నిక సందర్భంగా జిల్లాస్థాయిలోనూ చర్చకు దారితీసే భోగాపురం రాజకీయాలు ఈసారి కూడా అదే తరహా ఉత్కంఠను కొనసాగిస్తున్నాయి. మొత్తం 16 ఎంపీటీసీ స్థానాలకు గాను ఏ ఒక్క పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ఎంపీపీ పీఠం కోసం కొత్త రాజకీయ సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి.
తాజా ఫలితాల్లో వైఎస్సార్‌సీపీ ఆరు, తెలుగుదేశం పార్టీ మూడు, జనసేన పార్టీ మూడు స్థానాలను సాధించగా, స్వతంత్ర అభ్యర్థులు నాలుగు స్థానాల్లో విజయం సాధించారు. దీంతో ఏ పార్టీకి సొంతంగా ఎంపీపీ పీఠాన్ని దక్కించుకునే సంఖ్యాబలం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో స్వతంత్ర అభ్యర్థుల మద్దతు ఎటువైపు ఉంటుందన్నది కీలకంగా మారింది. వారి నిర్ణయమే తదుపరి రాజకీయ పరిణామాలకు దిశానిర్దేశం చేసే పరిస్థితి కనిపిస్తోంది.
* కూటమి ధర్మం.. నాయకత్వంపై చర్చ!
రాష్ట్రస్థాయిలో తెలుగుదేశం, జనసేన పార్టీలు కూటమిగా కొనసాగుతున్న నేపథ్యంలో మండలస్థాయిలోనూ ఆ అనుబంధం ఎంపీపీ ఎన్నికలో ఎలా ప్రతిఫలిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. రెండు పార్టీలకు కలిపి ఆరు స్థానాలే ఉండటంతో ఎంపీపీ పీఠాన్ని దక్కించుకోవాలంటే అదనపు మద్దతు తప్పనిసరి. ఈ క్రమంలో జనసేనకు నాయకత్వ అవకాశం కల్పించాలా? లేక తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి అవకాశం ఇవ్వాలా? అన్న అంశం రాజకీయ చర్చల్లో ప్రాధాన్యం సంతరించుకుంది ఒకవేళ జనసేన తన మూడు స్థానాలను టీడీపీకి మద్దతుగా నిలిపితే, తెలుగుదేశం పార్టీ బలం ఆరుకు చేరుతుంది. దీనికి స్వతంత్రుల మద్దతు కూడా జతకలిస్తే సంఖ్యాబలం పది వరకు చేరే అవకాశం ఉంటుంది. మరోవైపు కూటమిలో భాగంగా టీడీపీ తన స్థానాలను జనసేనకు మద్దతుగా నిలిపినా, ఎంపీపీ ఎన్నికకు అవసరమైన ఇతర సభ్యుల మద్దతును సమీకరించుకోవాల్సి ఉంటుంది. దీంతో కూటమి భాగస్వామ్య పార్టీల మధ్య పరస్పర అవగాహన, నాయకత్వ నిర్ణయం కీలకంగా మారనున్నాయి.
* స్వతంత్రుల మద్దతుపైనే అసలు లెక్కలు!
ప్రస్తుతం భోగాపురం రాజకీయాల్లో స్వతంత్ర అభ్యర్థుల పాత్ర అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. నాలుగు స్థానాల్లో విజయం సాధించిన స్వతంత్రులు ఎటువైపు మొగ్గు చూపుతారన్నదానిపై రకరకాల చర్చలు సాగుతున్నాయి. విశ్వసనీయ రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం వీరిలో కొందరు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నారన్న ప్రచారం వినిపిస్తోంది. అయితే ఈ మద్దతుపై అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది. స్వతంత్రులంతా ఒకే నిర్ణయానికి వస్తారా? లేక విడివిడిగా తమ రాజకీయ వైఖరిని వెల్లడిస్తారా? అన్నది వేచి చూడాల్సిందే.
స్వతంత్రుల మద్దతు టీడీపీకి అనుకూలంగా సమకూరితే ఎంపీపీ ఎన్నికలో ఆ పార్టీకి ఒక రాజకీయ సమీకరణం ఏర్పడుతుంది. అదే సమయంలో జనసేన సభ్యుల సహకారం కూడా లభిస్తే కూటమి బలంతో ఎంపీపీ ఎంపిక ప్రక్రియ ముందుకు సాగే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో కూటమి పార్టీల మధ్య చర్చలు, స్వతంత్రులతో సంప్రదింపులు ఎలాంటి మలుపు తీసుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది.
* ఎంపీపీ బరిలో పోలిపల్లి లక్ష్మి పేరు ప్రస్తావన!
ఈ రాజకీయ సమీకరణాల నేపథ్యంలో పోలిపల్లి ఎంపీటీసీ అభ్యర్థిని కర్రోతు లక్ష్మి పేరు ఎంపీపీ పదవికి సంబంధించి రాజకీయ వర్గాల్లో ప్రస్తావనకు వస్తోంది. టీడీపీ, జనసేన మధ్య అవగాహన కుదిరి, స్వతంత్రుల మద్దతు కూడా సమకూరితే ఎంపీపీ అభ్యర్థిత్వంపై ఆమె పేరు పరిశీలనకు వచ్చే అవకాశముందన్న చర్చ సాగుతోంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఇక వైఎస్సార్‌సీపీ ఆరు స్థానాలతో గణనీయమైన బలాన్ని ప్రదర్శించిన నేపథ్యంలో ఆ పార్టీ అనుసరించే వ్యూహం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. మిగిలిన స్థానాల మద్దతు సమీకరణంలో ఆ పార్టీ ఎలాంటి ప్రయత్నాలు చేస్తుందన్నది కూడా ఆసక్తికరమైన అంశమే. మరోవైపు కూటమి భాగస్వామ్య ధర్మం, స్థానిక రాజకీయ పరిస్థితులు, స్వతంత్రుల నిర్ణయాలు ఎంపీపీ ఎన్నికలో కీలక పాత్ర పోషించనున్నాయి. మొత్తానికి భోగాపురం మండలంలో ఎంపీపీ పీఠం కోసం రాజకీయ లెక్కలు మొదలయ్యాయి. సంఖ్యాబలం, భాగస్వామ్య పార్టీల మధ్య అవగాహన, స్వతంత్రుల మద్దతు.. ఈ మూడు అంశాల చుట్టూనే ప్రస్తుత రాజకీయ చర్చ సాగుతోంది. ఎన్నికల ఫలితాలు వెలువడినా అధ్యక్ష పీఠంపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. మరికొద్ది రోజుల్లో జరిగే పరిణామాలు భోగాపురం మండల పరిషత్‌కు నాయకత్వం వహించేది ఎవరో తేల్చనున్నాయి.