న్యుమోనియా నివారణకు ఎస్ ఎ ఎ ఎన్ ఎస్ కార్యక్రమంపై అవగాహన కార్యక్రమం.............జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బాలకృష్ణ నాయక్.
తిరుపతి వైద్యం, మేజర్ న్యూస్ : చిన్నారుల్లో న్యుమోనియా వ్యాధిని నివారించి మరణాలు రేటు తగ్గించడమే ఎస్ ఎ ఎ ఎన్ ఎస్ లక్ష్యమని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బాలకృష్ణ నాయక్ స్పష్టం చేశారు. గురువారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం నందు ఎస్ ఎ ఎ ఎన్ ఎస్ ప్రోగ్రాం కు సంబంధించిన పోస్టర్లను బ్యానర్ లను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వి బాలకృష్ణ నాయక్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
చిన్నారుల్లో న్యుమోనియా వ్యాధిని నివారించి ఐదేళ్లలోపు పిల్లల మరణాల రేటును తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఎస్ ఎ ఎ ఎన్ ఎస్ కార్యక్రమాన్ని అమలు చేస్తోందని తెలిపారు.
న్యుమోనియా అనేది ముఖ్యంగా ఐదేళ్లలోపు చిన్నారుల్లో కనిపించే తీవ్రమైన శ్వాసకోశ వ్యాధి అని, సకాలంలో గుర్తించి సరైన వైద్యం అందిస్తే వ్యాధి తీవ్రతను తగ్గించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా నవంబర్ 12వ తేదీ నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు ప్రజలకు న్యుమోనియా వ్యాధి లక్షణాలు, నివారణ చర్యలు చికిత్సపై వైద్య సిబ్బంది అవగాహన కల్పిస్తారని తెలిపారు.
న్యుమోనియా నివారణకు తీసుకోవాల్సిన ముఖ్యమైన చర్యలు వివరించారు. చిన్నారులకు ఆరు నెలల వరకు తల్లిపాలను మాత్రమే అందించాలన్నారు.ఆరు నెలల తర్వాత తల్లిపాలతో పాటు పోషకాహారం అందించాలనీతెలిపారు.
చిన్నారులకు ప్రభుత్వ సూచించిన టీకాలను సమయానికి వేయించాలన్నారు.పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలనీ తెలిపారు.పిల్లలను పొగ, దుమ్ము వాయు కాలుష్యానికి దూరంగా ఉంచాలన్నారు.చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలనీ పేర్కొన్నారు.పిల్లల్లో దగ్గు, జ్వరం, వేగంగా శ్వాస తీసుకోవడం, ఛాతీ లోపలికి లాగబడటం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలనీకోరారు.
ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, అంగన్‌వాడీ కార్యకర్తలు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి తల్లిదండ్రులకు న్యుమోనియా నివారణపై అవగాహన కల్పించాలని సూచించారు.
చిన్నారుల్లో న్యుమోనియాను ప్రాథమిక దశలోనే గుర్తించి తగిన వైద్యం అందించడం ద్వారా ప్రాణాలను కాపాడవచ్చని ఈ కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ శాంతకుమారి ప్రోగ్రాం అధికారులు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
శివమూర్తి, స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి