నిందితుడి అరెస్ట్.. రిమాండ్ కు తరలింపు
సూర్య, భీమిని :
భీమిని పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన క్రైమ్ నం.46/2024 కేసులో నిందితుడైన రామటేంకి శ్రీకాంత్ ( 31 ) గురువారం అ రెస్ట్ చేసి రిమాండ్ కు తరలించి నట్లు ఎస్ ఐ పి.కోటేశ్వర్తెలిపారు, ఈ సందర్భం గా ఎస్ ఐ మాట్లాడుతూ.. భీమిని గ్రామంకు చెందిన నిందితుడు కోర్టు వాయిదాలకు గైర్హాజరు అవుతున్న నేపథ్యంలోన్యాయస్థానం నిందితుడిపై నాన్ బెయిలబుల్ వారెంట్ ( ఎన్ బి డబ్ల్యూ ) జారీచేయడం జరిగిందన్నారు. ఈ క్రమంలో సదరు నిందితుడిని అదుపులోకి తిడుకొని కోర్టులో హాజరు పరుచగా కోర్ట్ నిండితుడికి రిమాండ్ విధించిరన్నారు. కోర్టు కేసుల్లో నిందితులు నిర్ణీత వాయిదాలకు తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు. కోర్టు వాయిదాలకు గైర్హాజరైన వారిపై న్యాయస్థానం ఆదేశాల మేరకు చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్ ఐ తెలిపారు.