telangana
వేసవికి విద్యుత్ శాఖ ముందస్తు ఏర్పాట్లు - ఓవర్‌లోడ్ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లపై ప్రత్యేక దృష్టి
సూర్య,కాగజ్‌నగర్: రాబోయే వేసవిలో పెరిగే విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా ముందస్తు చర్యలు చేపట్టాలని టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న సూపరింటెండింగ్ ఇంజనీర్, విద్యుత్ రెవెన్యూ కార్యాలయ భవనాల పనులను ఆయన పరిశీలించారు.అనంతరం నిర్వహించిన సమీక్షలో ఓవర్‌లోడ్ విద్యుత్ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లను గుర్తించి అవసరమైన చోట అదనపు ట్రాన్స్‌ఫార్మర్లు, కెపాసిటర్ బ్యాంకులు ఏర్పాటు చేయాలని సూచించారు. తక్కువ వోల్టేజీ సమస్యలను పరిష్కరించి వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించాలని ఆదేశించారు. మిషన్ భగీరథ విద్యుత్ కనెక్షన్లకు సంబంధించిన పనులను త్వరగా పూర్తి చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో కొమురం భీం సర్కిల్ ఎస్‌ఈ ఉత్తమ్ జాడే, డీఈలు, ఏడీఈలు, ఏఈలు, ఇతర అధికారులు, యూనియన్ నాయకులు పాల్గొన్నారు.