andhrapradesh
నూతన ఆవిష్కరణల దిశగా ముందుకు సాగాలి
నగరం, మేజర్ న్యూస్:
విద్యార్థులు పరిశోధనాత్మక దృక్పథాన్ని పెంపొందించుకొని, నూతన ఆవిష్కరణల దిశగా ముందుకు సాగాలని, ఆధునిక శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అధునాతన పదార్థాలు, నానోటెక్నాలజీ పరిశోధనలకు ఉన్న ప్రాధాన్యతను పలువురు వక్తలు వివరించారు. నగరంలోని శ్రీ వెలగపూడి రామకృష్ణ స్మారక కళాశాల రసాయన భౌతిక శాస్త్ర విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో అంతర్గత నాణ్యత హామీ విభాగం సహకారంతో "అడ్వాన్స్డ్ మెటీరియల్స్ ఇన్ కెమిస్ట్రీ, ఫిజిక్స్ అండ్ నానో టెక్నాలజీ ఫర్ నెక్స్ట్ జనరేషన్" అనే అంశంపై రెండవ రోజైన గురువారం జాతీయ సెమినార్ ముగింపు కార్యక్రమం నిర్వహించారు. బయో మెటీరియల్స్ ప్రాముఖ్యత, వాటి అభివృద్ధి, భవిష్యత్ అవసరాలపై నాగార్జున విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ కె.ఎస్.వి. కృష్ణారావు వివరించారు. ప్రొఫెసర్ ఆర్. రమేష్ రాజు మాట్లాడుతూ అధునాతన మెటీరియల్స్‌కు సంబంధించిన పరిశోధనలు, వాటి ప్రాముఖ్యత గురించి వివరించారు. పి. నరేష్ మాట్లాడుతూ కాంపోజిట్ మెటీరియల్స్, వాటి లక్షణాలు, వివిధ రంగాలలో వాటి అనువర్తనాల గురించి వివరించారు. సెమినార్ ద్వారా విద్యార్థులు, పరిశోధకులు, అధ్యాపకులకు నూతన శాస్త్రీయ అంశాలపై అవగాహన కలిగిందని నిర్వాహకులు తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అనగాని హరికృష్ణ అధ్యక్షతన వహించగా, కళాశాల పాలకవర్గ ఎగ్జిక్యూటివ్ సభ్యులు కొసరాజు రమణమూర్తి, సెక్రటరీ, కరస్పాండెంట్ వల్లభనేని బుచ్చయ్య చౌదరి, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆర్. ప్రసన్న బాబు, కన్వీనర్ డాక్టర్ పి. శ్రీనివాసరావు, కళాశాల కార్యాలయ సూపరింటెండెంట్ పి. అమరేష్ రెడ్డి, అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.