BREAKING
రాష్ట్రంలో ‘సెక్యూరిటీ ఇన్నోవేషన్ శాండ్‌బాక్స్’: హోం మంత్రి అనిత వెల్లడి జడ్పిటిసి ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో అసత్య ప్రచారాలు ఆపండి, మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు రాజపుత్ర సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మానం శాసనమండలి మాజీ విప్ గంగుల సమక్షంలో వైకాపాలో చేరిక ఎన్నికల నియమావళి ని ఖచ్చితంగా పాటించాలి - డి ఎల్ డి వో రమణయ్య కలెక్టరేట్‌ గ్రంథాలయానికి రెండో రోజు పుస్తకాల విరాళం ఇక తెలంగాణలో భారత్ విస్తార్ సేవలు కొత్త హంగులతో ముస్తాబవుతున్న నెల్లూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్! మాచర్ల : శనివారం రిజిస్ట్రేషన్ సేవలు యధాతధం స్థలం విషయంలో మహిళపై దాడి చిన్నారుల్లో న్యుమోనియా నిర్మూలనకు ప్రచారం - నవంబర్ 12 నుంచి ఫిబ్రవరి 28 వరకు విద్యార్థులకు ప్యాడ్లు, నోటుపుస్తకాలు పంపిణీ గుర్తుతెలియని వ్యక్తి మృతి.. ఆచూకీ కోసం పోలీసుల విజ్ఞప్తి విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి.

విద్యార్థుల మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలి - జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

Select Suryaa Now
విద్యార్థుల మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలి - జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
సూర్య, కాసిపేట : ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేస్తూ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందని, ఈ క్రమంలో ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం జిల్లాలోని కాసిపేట మండలంలోని ప్రాంతాలలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థులకు కల్పిస్తున్న మౌలిక సదుపాయాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ విద్యాసంస్థలలో చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించి, నాణ్యమైన విద్య, మెనూ ప్రకారం పౌష్టిక ఆహారం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పాఠశాలలలో చేపట్టిన అభివృద్ధి పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, పెండింగ్ లో ఉన్న పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తిచేయాలని తెలిపారు. పాఠశాలలకు అవసరమైన బెడ్స్ ఇంకా అందుబాటులోకి రాలేదని గుర్తించి, సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే బెడ్స్ సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన పరుపులతో పాటు బెడ్స్‌ను కూడా త్వరగా ఏర్పాటు చేయాలని తెలిపారు. విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సదుపాయాలు కల్పించాలని, వంటశాల, భోజనశాలను పరిశుభ్రంగా నిర్వహించాలని, అవసరమైన అన్ని వసతులు సమకూర్చుకోవాలని సూచించారు. మండలంలోని పెద్దాపూర్ గ్రామంలో కొనసాగుతున్న భూ రీ సర్వే ప్రక్రియను నాయబ్ తహసిల్దార్ అంజయ్యతో కలిసి పరిశీలించి, సర్వే పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. రీ సర్వే సిబ్బంది ఉదయం వేళల్లోనే క్షేత్రస్థాయికి చేరుకొని పనులు ప్రారంభిస్తే ఎక్కువ భూమిని సర్వే చేయడానికి అవకాశం ఉంటుందని, తద్వారా పనులు త్వరగా పూర్తవుతాయని తెలిపారు. సర్వే సిబ్బందికి అవసరమైన సహకారం అందించాలని తహసిల్దార్లకు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అక్రమ భూ ఆక్రమణలకు అవకాశం కల్పించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. దేవాపూర్ గ్రామంలోని బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించి విద్యార్థులకు కల్పిస్తున్న వసతులను పరిశీలించారు. వంటశాలను తనిఖీ చేసి ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం భోజనం అందించడంపై విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలోని తరగతి గదులు, వసతి గదులు, ఇతర మౌలిక సదుపాయాలను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతి సదుపాయాలు కల్పించాలని, సెలవుల అనంతరం విద్యార్థులందరూ తిరిగి పాఠశాలకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అనంతరం బెల్లంపల్లి మండల కేంద్రంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సబ్ కలెక్టర్ మనోజ్ తో కలిసి మండలాల తహసిల్దార్లతో భూ రీ సర్వే, జి.ఓ. నంబర్ 59, 76 అమలు, భూభారతి డిజిటల్ ప్రక్రియ తదితర అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న భూ సంబంధిత దరఖాస్తులు, సర్వే పనులను నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని సూచించారు. సింగరేణి ప్రాంతానికి సంబంధించిన భూ సమస్యలు, జి.ఓ. నంబర్ 76 క్రింద చేపట్టవలసిన చర్యలపై సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. భూ రీ సర్వే పనులు వేగంగా పూర్తయ్యేలా తహసిల్దార్లు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని, సర్వే సిబ్బంది ఉదయాన్నే గ్రామాలకు చేరుకొని పనులు ప్రారంభించేలా సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో  ఆయా మండలాల తహసీల్దార్లు, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.