BREAKING
రాజపుత్ర సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మానం శాసనమండలి మాజీ విప్ గంగుల సమక్షంలో వైకాపాలో చేరిక ఎన్నికల నియమావళి ని ఖచ్చితంగా పాటించాలి - డి ఎల్ డి వో రమణయ్య కలెక్టరేట్‌ గ్రంథాలయానికి రెండో రోజు పుస్తకాల విరాళం ఇక తెలంగాణలో భారత్ విస్తార్ సేవలు కొత్త హంగులతో ముస్తాబవుతున్న నెల్లూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్! మాచర్ల : శనివారం రిజిస్ట్రేషన్ సేవలు యధాతధం స్థలం విషయంలో మహిళపై దాడి చిన్నారుల్లో న్యుమోనియా నిర్మూలనకు ప్రచారం - నవంబర్ 12 నుంచి ఫిబ్రవరి 28 వరకు విద్యార్థులకు ప్యాడ్లు, నోటుపుస్తకాలు పంపిణీ గుర్తుతెలియని వ్యక్తి మృతి.. ఆచూకీ కోసం పోలీసుల విజ్ఞప్తి విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి. నగరంలో కోలాట ప్రదర్శన ఆత్మకూరుకు పట్టణ శోభ యోగం ఎన్నటికో అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని చందం పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఆర్వోలను నియామకము

గ్రామంలోకి బస్సు రావాలని గ్రామస్తుల ఆధ్వర్యంలో సర్పంచ్ ధర్న

Select Suryaa Now
గ్రామంలోకి బస్సు రావాలని గ్రామస్తుల ఆధ్వర్యంలో సర్పంచ్ ధర్న
సూర్య నెన్నెల : బెల్లంపల్లి నుండి నెన్నెల మీదుగా మైలారం వెళ్లే బస్సు యథావిధిగా గ్రామంలోకి రావాలని డిమాండ్ చేస్తూ స్థానిక  సర్పంచ్ ఎండి ఇబ్రహీం ఆధ్వర్యంలో ప్రజలు ధర్నా చేశారు. గురువారం మండల కేంద్రంలో రోడ్డుపై బస్సు ముందర బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాతికేళ్లుగా  గ్రామంలోకి బస్సు వస్తూ విద్యార్థులు, రైతులు, కూలీలు, మహిళలు, వృద్ధులకు రవాణా సౌకర్యం కల్పిస్తోందనీ అన్నారు . అయితే ఈ రోజు కొత్తగా వచ్చిన ఆర్టీసీ డ్రైవర్ ఇబ్బందులు సృష్టిస్తూ బస్సును గ్రామంలోకి రాకుండా ఊరు బయట నుంచి బస్సులు తీసుకెళ్లడంతో విద్యార్థులు, వృద్ధులు, తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సర్పంచ్ ఉన్నతాధికారులను కోరాడు.గ్రామంలోకి బస్సు రాకపోవడంతో విద్యార్థులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సర్పంచ్ తెలిపాడు. బస్సు సౌకర్యాన్ని యథావిధిగా కొనసాగించాలని, గ్రామ ప్రజలకు ఇబ్బందులు కలిగించకుండా ఆర్టీసీ అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశాడు. బస్సు ఊర్లోకి రానిదే వదిలిపెట్టేది లేదని ప్రజలు బిస్మించి బస్సు కదలకుండా కూర్చోవడంతో స్థానిక ఎస్ఐ జగదీశ్వర్ రెడ్డి కలుగజేసుకొని రోజుూ లాగానే బస్సు ఊర్లో కి వచ్చేలా చూడాలి చూడాలని సిబ్బంది కోరాడు. అనంతరం డ్రైవర్ బస్సును ఊర్లోకి తీసుకురావడంతో ఆందోళన విరమించారు. భవిష్యత్ లో మళ్ళీ ఇలాగే చేస్తే గ్రామస్తులు, యువ యువకుల, మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని గ్రామ ప్రజలు హెచ్చరించారు.ఈ ధర్నాలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సమస్య పరిష్కారం కాకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని గ్రామ ప్రజలు డ్రైవర్ ను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కీసరి సంతోష్ , మాజీ ఉప సర్పంచ్ గడ్డం స్వామి గౌడ్, భాస్కర్, అంజన్న, క్రిష్ణ స్వామి, తిరుమల్, రాము, శ్రీశైలం, ఆశన్న, తాజ్, ఆశన్నబాపు, వెంకన్న, దుర్గయ్య, ప్రవీణ్,నాగేష్, సంతోష్, లస్మయ్య, మల్లన్న, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.