BREAKING
గ్రామపంచాయతీ ఎన్నికలు కోసం స్టేజ్ వన్ రిటర్నింగ్ అధికారుల శిక్షణా కార్యక్రమం క్యాన్సర్ చికిత్సను మరింత అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం చర్యలు నాణ్యమైన గృహ నిర్మాణానికి బిల్డర్లు ప్రాధాన్యమివ్వాలి-మంత్రి నారాయణ అర్హులైన ప్రతి కుటుంబానికి బీమా భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం.. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క.. పంచాయతీ ఎన్నికలకు పటిష్ట భద్రతా ప్రణాళిక ఓలా సంస్థకు పది లక్షల జరిమానా విధించిన సీసీపీఏ సుబ్రహ్మణ్యం కు గ్లోబల్ ఎడ్యుకేషనల్ అవార్డు భారత్ - శ్రీలంక సంయుక్త సైనిక విన్యాసాలు 'మిత్ర శక్తి 2026' ప్రారంభం రాష్ట్రపతి భవన్‌లో అట్టహాసంగా నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ ప్రదానోత్సవం ఫిర్యాదులు నిర్ణీత గడువు లోపు పరిష్కరించాలి --- జడ్పీ సీఈవో మధుసూదన్ మూడు రోజుల లాభాలకు గండి, నష్టాలతో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ స్థానిక సమరానికి జనసేన కసరత్తు. ఉదయగిరినియోజకవర్గంలో మండలాల వారీగా నేతల సన్నాహాలు. బెంగళూరు-మంగళూరు-మర్గావో మార్గాల్లో నూతన వందే భారత్ చైర్ కార్ సర్వీసులను ప్రారంభించిన ప్రధాని మోదీ భక్తిశ్రద్ధలతో నాగుల చవితి జాకీర్ నాయక్ ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్‌పై మరో ఐదేళ్లపాటు నిషేధం పొడిగింపు

ఆపదలో ఉన్న ఖాతాదారుడి కుటుంబానికి గాయత్రి బ్యాంకు ఆర్థిక భరోసా

Select Suryaa Now
ఆపదలో ఉన్న ఖాతాదారుడి కుటుంబానికి గాయత్రి బ్యాంకు ఆర్థిక భరోసా
సూర్య, మంచిర్యాల : ఖాతాదారులకు బ్యాంకింగ్ సేవలతో పాటు ఆర్థిక భద్రత కల్పించడంలో గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు ముందుంటోంది. ఇందులో భాగంగా ప్రమాదవశాత్తు మృతిచెందిన మంచిర్యాల శాఖ ఖాతాదారుడు నజీర్ మొహమ్మద్ కుటుంబానికి బ్యాంకు ప్రమాద బీమా ద్వారా రూ.2 లక్షల ఆర్థిక సహాయం అందించింది. మృతుడి భార్య ఫాతిమా బీకి మంచిర్యాల కార్పొరేటర్ మహమ్మద్ గౌసుద్దీన్ చేతుల మీదుగా గురువారం బీమా చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ బ్యాంకు అందిస్తున్న ప్రమాద బీమా సదుపాయం బాధిత కుటుంబానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ఖాతాదారులకు ఆర్థిక భద్రత కల్పించడంతో పాటు, రైతులకు ఏడాదికి 10.50 శాతం వడ్డీతో వ్యవసాయ రుణాలు అందించడం అభినందనీయమన్నారు. పరిసర గ్రామాల్లో బ్యాంకింగ్ కరస్పాండెంట్లను ఏర్పాటు చేసి పెన్షనర్లు, ఇతర ఖాతాదారులకు గ్రామస్థాయిలోనే బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తీసుకురావడాన్ని ప్రశంసించారు. బ్రాంచి మేనేజర్ కేలేటి ప్రవీణ్ మాట్లాడుతూ ఖాతాదారులకు నిరంతర సేవలు అందించడమే లక్ష్యంగా బ్యాంకు పనిచేస్తోందని తెలిపారు. 24 గంటల పాటు ఏటీఎంలలో నగదు అందుబాటులో ఉంచుతున్నామని, బంగారు ఆభరణాలపై తక్కువ వడ్డీతో గ్రాముకు గరిష్ఠంగా రూ.10 వేల వరకు రుణాలు మంజూరు చేస్తున్నామని వివరించారు. సేవింగ్స్ ఖాతాల ప్రారంభానికి అవసరమైన ఫొటోలు, జిరాక్స్ ప్రతులను బ్యాంకులో ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు. వ్యాపారుల అవసరాలకు అనుగుణంగా వ్యాపార రుణాలు, రైతులకు వ్యవసాయ రుణాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. కిసాన్ వికాస్ పత్రాలు, పోస్టాఫీస్ డిపాజిట్లపై సైతం 10 శాతం వార్షిక వడ్డీ రేటుతో రుణ సదుపాయం అందిస్తున్నట్లు తెలిపారు. బ్యాంకు అందిస్తున్న వివిధ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జి. సుధాకర్, సీనియర్ ఆఫీసర్ ఆర్. రమేష్, జూనియర్ ఆఫీసర్ ఇ. శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.