BREAKING
గ్రామపంచాయతీ ఎన్నికలు కోసం స్టేజ్ వన్ రిటర్నింగ్ అధికారుల శిక్షణా కార్యక్రమం క్యాన్సర్ చికిత్సను మరింత అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం చర్యలు నాణ్యమైన గృహ నిర్మాణానికి బిల్డర్లు ప్రాధాన్యమివ్వాలి-మంత్రి నారాయణ అర్హులైన ప్రతి కుటుంబానికి బీమా భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం.. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క.. పంచాయతీ ఎన్నికలకు పటిష్ట భద్రతా ప్రణాళిక ఓలా సంస్థకు పది లక్షల జరిమానా విధించిన సీసీపీఏ సుబ్రహ్మణ్యం కు గ్లోబల్ ఎడ్యుకేషనల్ అవార్డు భారత్ - శ్రీలంక సంయుక్త సైనిక విన్యాసాలు 'మిత్ర శక్తి 2026' ప్రారంభం రాష్ట్రపతి భవన్‌లో అట్టహాసంగా నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ ప్రదానోత్సవం ఫిర్యాదులు నిర్ణీత గడువు లోపు పరిష్కరించాలి --- జడ్పీ సీఈవో మధుసూదన్ మూడు రోజుల లాభాలకు గండి, నష్టాలతో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ స్థానిక సమరానికి జనసేన కసరత్తు. ఉదయగిరినియోజకవర్గంలో మండలాల వారీగా నేతల సన్నాహాలు. బెంగళూరు-మంగళూరు-మర్గావో మార్గాల్లో నూతన వందే భారత్ చైర్ కార్ సర్వీసులను ప్రారంభించిన ప్రధాని మోదీ భక్తిశ్రద్ధలతో నాగుల చవితి జాకీర్ నాయక్ ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్‌పై మరో ఐదేళ్లపాటు నిషేధం పొడిగింపు

అంగన్‌వాడీ కార్యకర్తలకు ‘పోషణ్‌ భీ పఢాయీ భీ’పై రెండో రోజు శిక్షణ

Select Suryaa Now
అంగన్‌వాడీ కార్యకర్తలకు ‘పోషణ్‌ భీ పఢాయీ భీ’పై రెండో రోజు శిక్షణ

 వత్సవాయి మేజర్ న్యూస్ :- అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చిన్నారుల ఆరోగ్య పరిరక్షణ, సమగ్ర అభివృద్ధిపై తల్లులకు అవగాహన కల్పించే లక్ష్యంతో అంగన్‌వాడీ కార్యకర్తలకు రెండో రోజు ‘పోషణ్‌ భీ పఢాయీ భీ’ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సీడీపీఓ సత్యవతి, ఏసీడీపీఓ సరళ, సూపర్‌వైజర్ బీబీజాన్ పాల్గొని అంగన్‌వాడీ కార్యకర్తలకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. దివ్యాంగ పిల్లలను గుర్తించడం, వారికి అవసరమైన వైద్య సేవలు అందించేందుకు రిఫరల్ ప్రక్రియ, వైకల్యాల రకాలు, స్క్రీనింగ్ విధానాల గురించి వివరించారు.అలాగే సున్నా నుంచి ఆరు సంవత్సరాల వయస్సు గల పిల్లల్లో ఎదుగుదల మైలురాళ్లు, వారి శారీరక, మానసిక అభివృద్ధిని గుర్తించే విధానాలపై శిక్షణ ఇచ్చారు. గృహ సందర్శనల సమయంలో తల్లులకు పిల్లల ఆరోగ్యం, పోషకాహారం, సంరక్షణపై ఏ విధంగా అవగాహన కల్పించాలనే అంశాలను వివరించారు.ఈ శిక్షణ ద్వారా అంగన్‌వాడీ కార్యకర్తలు చిన్నారుల అభివృద్ధిని మరింత సమర్థవంతంగా పర్యవేక్షిస్తూ, అవసరమైన వారికి తగిన సేవలు అందించాలని సూచించారు.