BREAKING
భర్తని పిలుస్తుంటే ఇప్పటికీ క్యూట్‌గా ఉంది.. సినిమాటోగ్రాఫర్ నిమిష్ రవికి నటి అహానా కృష్ణ బర్త్ డే విషెస్ అండూరులో ఉచిత పశువైద్య శిబిరం యాచారం ముదిరాజ్ సంఘం గ్రామ కమిటీ ఎన్నిక రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం* పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి *పారిశ్రామిక ప్రాంతంలో రోడ్లపైనే భారీ వాహనాల పార్కింగ్* అసోంలో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది విద్యార్థుల దుర్మరణం అంబేద్కర్ సేవా సమితి ఆధ్వర్యంలో పట్టణ ఎస్సీ కౌన్సిలర్లకు సన్మానం బాలలు ఆనందంగా బాల్యాన్ని గడపాలి దాతృత్వ స్ఫూర్తిని చాటిన గీతం బీ-స్కూల్ విద్యార్థులు అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తాం: ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పల్లె పోరు అయినా ప్రజాస్వామ్యబద్ధంగా జరపండి జిల్లా వికలాంగుల కమిటీలో చేర్యాల వాసికి స్థానం* సీపీఎం నాయకుల ఆధ్వర్యంలో తుమ్మలపల్లి అనిల్‌కు ఘన సన్మానం శ్రీ కపిలేశ్వరాలయంలో భక్తిశ్రద్ధలతో ముగిసిన శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారి హోమం ప్రెస్ మీట్‌లో బోరున విలపించిన 'బ్లాక్ గోల్డ్' చిత్ర నిర్మాత మూర్తి.. అసలు కారణం ఏమిటంటే? ప్రపంచ పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామం.. ‘

నేటి బాలలే.. రేపటి భావి పౌరులు టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.. మాచాని

Select Suryaa Now
నేటి బాలలే.. రేపటి భావి పౌరులు   టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.. మాచాని
 
 
ఎమ్మిగనూరు,సూర్  ప్రతినిధి  నేటి బాలలు ఉన్నత చదువులు చదివి భావి భారత పౌరులుగా రానున్న సమాజానికి నిలువెత్తు నిదర్శనంగా నిలవాలని ఇందుకు  మీకు కావాల్సినదంతా క్రమశిక్షణతో ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు శ్రద్ధగా వింటే మీరే నిజమైన భారత దేశ వారసత్వ సంపదగా నిలుస్తారని టిడిపి బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ మాచాని సోమనాథ్ పేర్కొన్నారు. శుక్రవారం మాచాని సోమప్ప ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో  బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ జాతీయ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని పద్మశ్రీ మాచాని సోమప్ప మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నిర్వహించిన క్విజ్ పోటీలు ఉత్సాహంగా జరిగాయి. పట్టణంలోని మాచాని సోమప్ప ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో రాష్ట్ర టీడీపీ బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి డా. మాచాని సోమనాథ్ ఆధ్వర్యంలో వివిధ పాఠశాలలకు చెందిన 8, 9, 10వ తరగతి విద్యార్థులకు ఈ పోటీలు నిర్వహించారు.పోటీల్లో మాచాని సోమప్ప ఇంగ్లీష్ మీడియం స్కూల్‌కు చెందిన విజయ్, లిఖిత సాయి జంట మొదటి బహుమతిగా రూ.5,000,  నగదు బహుమతి పొందారు.వివర్స్ కాలనీ ప్రభుత్వ  జిల్లా పరిషత్ హైస్కూల్‌కు చెందిన తిరుమల సాయి, పార్థివ్ జంట రెండో బహుమతిగా రూ.3,000, ఎంఎస్ నగర్ జిల్లా పరిషత్ హైస్కూల్‌కు చెందిన భవాని ప్రసాద్, శివశంకర్ జంట మూడో బహుమతిగా రూ.2,000, కస్తూరి స్కూల్‌కు చెందిన ఇస్లాం భాష, వంశీకృష్ణ జంట నాలుగో బహుమతిగా రూ.1,000 నగదు, ప్రశంసాపత్రాలు అందుకున్నారు.ఈ సందర్భంగా డా. మాచాని సోమనాథ్ మాట్లాడుతూ నేటి బాలలే రేపటి భారతదేశ నిర్మాతలని, పిల్లల చిరునవ్వులోనే దేశ భవిష్యత్తు దాగి ఉందన్నారు. అందుకే మాజీ ప్రధానమంత్రి చాచా నెహ్రూ బాల అంటే ఇష్టపడతారన్నారు. విద్యార్థులు తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సూచనలు పాటిస్తూ క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.  విజేతలకు నగదు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు 
A. R శరత్ కుమార్, సూర్య ప్రతినిధి, ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లా.