సీతారామభద్ర క్షేత్ర నిర్మాణానికి రామాయంపేట మున్సిపల్ చైర్ పర్సన్ వీరాళం
సూర్య- బిక్కనూర్ : మండలంలోని రామేశ్వర్ పల్లి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న సీతారామ భద్ర క్షేత్ర నిర్మాణానికి మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపల్ చైర్ పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు గురువారం 25 వేల విరాళాన్ని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ మాట్లాడుతూ అయోధ్య స్ఫూర్తితో గ్రామంలో నిర్మిస్తున్న సీతారామ భద్ర క్షేత్ర నిర్మాణానికి తన వంతుగా సహకారం అందించడం తన అదృష్టం అన్నారు ఈ సందర్భంగా ఆలయ నిర్మాణానికి తనవంతుగా వినాలని అందజేసిన నాగరాజును శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పనస రాజు ఉన్నారు