BREAKING
తన వ్యక్తిగత స్వార్థం కోసం రేవంత్ రెడ్డి కుట్రలో పావుగా మారిన కల్వకుంట్ల కవిత. ఘనంగా నాగుల చవితి వేడుకలు ఎంపీపీ ఎన్నికకు అధికారుల ఏర్పాట్లు పూర్తి! ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, ఎంపీ బైరెడ్డి శబరికి ఆహ్వాన లేఖలు నైజీరియాలో ముగిసిన 21 రోజుల ఎబోలా కాంటాక్ట్ మానిటరింగ్ గ్రామపంచాయతీ ఎన్నికలు కోసం స్టేజ్ వన్ రిటర్నింగ్ అధికారుల శిక్షణా కార్యక్రమం క్యాన్సర్ చికిత్సను మరింత అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం చర్యలు నాణ్యమైన గృహ నిర్మాణానికి బిల్డర్లు ప్రాధాన్యమివ్వాలి-మంత్రి నారాయణ అర్హులైన ప్రతి కుటుంబానికి బీమా భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం.. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క.. పంచాయతీ ఎన్నికలకు పటిష్ట భద్రతా ప్రణాళిక ఓలా సంస్థకు పది లక్షల జరిమానా విధించిన సీసీపీఏ సుబ్రహ్మణ్యం కు గ్లోబల్ ఎడ్యుకేషనల్ అవార్డు భారత్ - శ్రీలంక సంయుక్త సైనిక విన్యాసాలు 'మిత్ర శక్తి 2026' ప్రారంభం రాష్ట్రపతి భవన్‌లో అట్టహాసంగా నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ ప్రదానోత్సవం ఫిర్యాదులు నిర్ణీత గడువు లోపు పరిష్కరించాలి --- జడ్పీ సీఈవో మధుసూదన్ మూడు రోజుల లాభాలకు గండి, నష్టాలతో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ

అంతర్జాతీయ మార్కెట్ కోసం అరకు కాఫీని సేకరించండి. -ఎస్ఎల్ఎన్ కాఫీ చైర్మన్ శతప్పన్ తో భేటీలో మంత్రి నారా లోకేష్ ప్ర‌తిపాద‌న‌.

Select Suryaa Now
అంతర్జాతీయ మార్కెట్ కోసం అరకు కాఫీని సేకరించండి.  -ఎస్ఎల్ఎన్ కాఫీ చైర్మన్ శతప్పన్ తో భేటీలో మంత్రి నారా లోకేష్ ప్ర‌తిపాద‌న‌.

సూర్య స్టేట్ బ్యూరో.

విశాఖపట్నం: ఎల్ఎల్ ఎన్ కాఫీ చైర్మన్ & మేనేజింగ్ డైరక్టర్ ఎన్.శతప్పన్ తో విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ విశాఖపట్నంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ... మిడిల్ ఈస్ట్, యూరప్, ఆగ్నేయాసియా, రష్యాతో సహా కీలక అంతర్జాతీయ మార్కెట్లకు ప్రీమియం అరకు కాఫీని సేకరించాల్సిందిగా కోరారు. అరకు కాఫీ ప్రాసెసింగ్, మార్కెటింగ్, పంపిణీ కోసం ఆంధ్రప్రదేశ్ గిరిజన కార్పొరేషన్ తో క‌లిసి ప‌నిచేయాల‌ని కోరారు. హైవే వెంట ఉన్న వేసైడ్ సౌకర్యాలు, ప్రధాన పట్టణ కేంద్రాల్లో ఎస్ఎల్ఎన్ కాఫీ అనుబంధ సంస్థ లెవిస్టా కేఫ్‌లను ఏర్పాటు చేయాల‌న్నారు. విశాఖపట్నం, విజయవాడ, అమరావతి, తిరుపతి పరిసరాలు ఇందుకు అనువుగా ఉంటాయని చెప్పారు. ఎస్ఎల్ ఎన్ కాఫీ చైర్మన్ శతప్పన్ మాట్లాడుతూ... ఎస్ఎల్ఎన్ కాఫీ ప్రైవేట్ లిమిటెడ్ కాఫీ కోసం తన సొంత ఇంటిగ్రేటెడ్ తయారీ, ప్రాసెసింగ్, క్యూరింగ్ యూనిట్లను నిర్వహిస్తోంది. తమ సంస్థ సంవత్సరానికి 30వేల నుంచి 50వేల మెట్రిక్ టన్నుల (ఎంటీ) వరకు క్యూరింగ్, గ్రీన్ బీన్ ట్రేడింగ్ సామర్థ్యం కలిగి ఉందని చెప్పారు. ఎస్ఎల్ఎన్ కాఫీ మొత్తం ఆదాయంలో 80% పైగా మిడిల్ ఈస్ట్, యూరప్, ఆగ్నేయాసియా, రష్యా, సీఐఎస్ ప్రాంతాల‌ నుంచి వస్తోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని శతప్పన్ అన్నారు.