విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి – అదనపు ఎస్పీ సత్యనారాయణ
* డ్రగ్స్, ఈవ్ టీజింగ్, సైబర్ నేరాలపై విద్యార్థులకు పోలీసుల అవగాహన
ఆలేరు,మేజర్ న్యూస్:
రాఘవ స్వచ్ఛంద సేవా సంస్థ,మంగ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యార్థి యువ సమ్మేళనం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు ఎస్పీ సీహెచ్.సత్యనారాయణ,యాదగిరిగుట్ట డీఎస్పీ పి.శ్రీనివాస్ నాయుడు హాజరై విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా అదనపు ఎస్పీ సత్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థులు చిన్న వయస్సు నుంచే ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని,క్రమశిక్షణతో చదువుకోవాలని సూచించారు.డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలకు అలవాటుపడి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని హితవు పలికారు.మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి సమాజానికి ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు.అలాగే డీఎస్పీ పి.శ్రీనివాస్ నాయుడు మాట్లాడుతూ ఈవ్ టీజింగ్ తీవ్రమైన నేరమని,మహిళలు,బాలికలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.తోటి విద్యార్థినులను వేధించడం,అసభ్యంగా ప్రవర్తించడం,సోషల్ మీడియా ద్వారా ఇబ్బందులకు గురిచేయడం వంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.అలాగే పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.అపరిచిత వ్యక్తులకు ఓటీపీలు,బ్యాంకు ఖాతా వివరాలు,వ్యక్తిగత సమాచారాన్ని వెల్లడించకూడదని,ఆన్‌లైన్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని విద్యార్థులకు వివరించారు.విద్యార్థులు చదువుతో పాటు సామాజిక బాధ్యతను అలవర్చుకొని,చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ బాధ్యతగల పౌరులుగా ఎదగాలని పోలీసు అధికారులు సూచించారు.డ్రగ్స్ నిర్మూలన,మహిళల పట్ల గౌరవం,సైబర్ నేరాల నివారణపై విద్యార్థులు,యువతకు అవగాహన కల్పించేలా కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట సీఐ ఎం.శంకర్ గౌడ్,ఆలేరు ఎస్‌హెచ్‌ఓ కిరణ్ కుమార్,ఎస్‌ఐ వినయ్,రాఘవ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు పులిపలుపుల మహేష్,మంగ ఫౌండేషన్ అధ్యక్షులు మంగ నరసింహులు,కౌన్సిలర్లు పాశికంటి సంపత్,బీజని కళ్యాణి,మధు,బబ్బూరి పోశెట్టి,సీసా సత్తయ్య,మంగ అరవింద్,ఐలి సందీప్,కళ్లెం జితేందర్,మొరిగాడి సిద్ధులు,కంతుల శంకర్,వడ్డెమాను నరేందర్,ఎలగల వెంకటేష్,ఎండీ.ఫయాజ్,మహమూద్,ఐలి భార్గవ్,ఎలగల శివ తదితరులు పాల్గొన్నారు.కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పోలీసు అధికారులకు,విద్యాసంస్థల ప్రతినిధులకు,విద్యార్థులకు,యువతకు రాఘవ స్వచ్ఛంద సేవా సంస్థ,మంగ ఫౌండేషన్ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.