BREAKING
గ్రామపంచాయతీ ఎన్నికలు కోసం స్టేజ్ వన్ రిటర్నింగ్ అధికారుల శిక్షణా కార్యక్రమం క్యాన్సర్ చికిత్సను మరింత అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం చర్యలు నాణ్యమైన గృహ నిర్మాణానికి బిల్డర్లు ప్రాధాన్యమివ్వాలి-మంత్రి నారాయణ అర్హులైన ప్రతి కుటుంబానికి బీమా భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం.. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క.. పంచాయతీ ఎన్నికలకు పటిష్ట భద్రతా ప్రణాళిక ఓలా సంస్థకు పది లక్షల జరిమానా విధించిన సీసీపీఏ సుబ్రహ్మణ్యం కు గ్లోబల్ ఎడ్యుకేషనల్ అవార్డు భారత్ - శ్రీలంక సంయుక్త సైనిక విన్యాసాలు 'మిత్ర శక్తి 2026' ప్రారంభం రాష్ట్రపతి భవన్‌లో అట్టహాసంగా నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ ప్రదానోత్సవం ఫిర్యాదులు నిర్ణీత గడువు లోపు పరిష్కరించాలి --- జడ్పీ సీఈవో మధుసూదన్ మూడు రోజుల లాభాలకు గండి, నష్టాలతో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ స్థానిక సమరానికి జనసేన కసరత్తు. ఉదయగిరినియోజకవర్గంలో మండలాల వారీగా నేతల సన్నాహాలు. బెంగళూరు-మంగళూరు-మర్గావో మార్గాల్లో నూతన వందే భారత్ చైర్ కార్ సర్వీసులను ప్రారంభించిన ప్రధాని మోదీ భక్తిశ్రద్ధలతో నాగుల చవితి జాకీర్ నాయక్ ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్‌పై మరో ఐదేళ్లపాటు నిషేధం పొడిగింపు

ఈ నెల 15న హైదరాబాదులో జరిగే "హలో నేతకాని చలో ఉస్మానియా" పోస్టర్ల విడుదల

Select Suryaa Now
ఈ నెల 15న హైదరాబాదులో జరిగే "హలో నేతకాని చలో ఉస్మానియా" పోస్టర్ల విడుదల
సూర్య, జన్నారం : ఈ నెల 15న హైదరాబాదులో జరగనున్న హలో నేతకాని చలో ఉస్మానియా కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్లను గురువారం జన్నారం మండల కేంద్రంలో గల అంబేద్కర్ విగ్రహం సమీపంలో నేతకాని సంఘం నాయకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా నేతకాని విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు, ప్రోగ్రాం కన్వీనర్ సాయిని ప్రసాద్ నేత మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణలో నేతకాని సమాజానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. హలో నేతకాని చలో ఉస్మానియా రాష్ట్రస్థాయి భారీ సమావేశాన్ని అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. వర్గీకరణ వల్ల నేతకాని సమాజానికి ఎదురయ్యే సమస్యలను భవిష్యత్తులో విద్యార్థులు, నిరుద్యోగ యువతకు కలిగే ఇబ్బందులను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. నేతకాని సమాజ హక్కుల సాధన అనేది ఒకరి బాధ్యత కాదని, సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ఈ విడుదల కార్యక్రమంలో ప్రోగ్రాం డైరెక్టర్ తాళ్లపల్లి రాజేశ్వర్, వైస్ చైర్మన్ బోర్లకుంట ప్రభుదాస్, కో కన్వీనర్ జాడి గంగాధర్, నేతకాని విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి దుర్గం వినోద్ కుమార్, మండల అధ్యక్షులు రత్నం లక్ష్మణ్, పట్టణ అధ్యక్షులు దుర్గం వసంత్, తదితరులు పాల్గొన్నారు.