BREAKING
గ్రామపంచాయతీ ఎన్నికలు కోసం స్టేజ్ వన్ రిటర్నింగ్ అధికారుల శిక్షణా కార్యక్రమం క్యాన్సర్ చికిత్సను మరింత అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం చర్యలు నాణ్యమైన గృహ నిర్మాణానికి బిల్డర్లు ప్రాధాన్యమివ్వాలి-మంత్రి నారాయణ అర్హులైన ప్రతి కుటుంబానికి బీమా భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం.. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క.. పంచాయతీ ఎన్నికలకు పటిష్ట భద్రతా ప్రణాళిక ఓలా సంస్థకు పది లక్షల జరిమానా విధించిన సీసీపీఏ సుబ్రహ్మణ్యం కు గ్లోబల్ ఎడ్యుకేషనల్ అవార్డు భారత్ - శ్రీలంక సంయుక్త సైనిక విన్యాసాలు 'మిత్ర శక్తి 2026' ప్రారంభం రాష్ట్రపతి భవన్‌లో అట్టహాసంగా నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ ప్రదానోత్సవం ఫిర్యాదులు నిర్ణీత గడువు లోపు పరిష్కరించాలి --- జడ్పీ సీఈవో మధుసూదన్ మూడు రోజుల లాభాలకు గండి, నష్టాలతో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ స్థానిక సమరానికి జనసేన కసరత్తు. ఉదయగిరినియోజకవర్గంలో మండలాల వారీగా నేతల సన్నాహాలు. బెంగళూరు-మంగళూరు-మర్గావో మార్గాల్లో నూతన వందే భారత్ చైర్ కార్ సర్వీసులను ప్రారంభించిన ప్రధాని మోదీ భక్తిశ్రద్ధలతో నాగుల చవితి జాకీర్ నాయక్ ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్‌పై మరో ఐదేళ్లపాటు నిషేధం పొడిగింపు

తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు.. హైదరాబాద్‌ కొత్త సీపీగా మహేష్‌ భగవత్‌

Select Suryaa Now
తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు.. హైదరాబాద్‌ కొత్త సీపీగా మహేష్‌ భగవత్‌
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖలో భారీ ప్రక్షాళన చోటుచేసుకుంది. పరిపాలనాపరమైన సౌలభ్యంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి 21 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ గురువారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బదిలీల్లో భాగంగా హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ (సీపీ)గా సీనియర్ ఐపీఎస్ అధికారి మహేష్ మురళీధర్ భగవత్ నియమితులయ్యారు. ఇప్పటివరకు హైదరాబాద్ సీపీగా బాధ్యతలు నిర్వర్తించిన వీసీ సజ్జనార్‌ను ఫైర్ అండ్ డిజాస్టర్ రెస్పాన్స్ డీజీగా ప్రభుత్వం బదిలీ చేసింది.

అలాగే, ఏసీబీ డీజీగా చారుసిన్హా, ఆర్టీసీ ఎండీగా అనిల్‌కుమార్‌, పౌర సరఫరాలశాఖ కమిషనర్‌గా వై. నాగిరెడ్డి నియమితులయ్యారు. ఉమెన్ అండ్ సేఫ్టీ డీజీపీగా సౌమ్య మిశ్రాకు బాధ్యతలు అప్పగించగా, జైళ్ల శాఖ (ప్రిజన్స్) డీజీపీగా స్వాతి లక్రాను బదిలీ చేశారు. గ్రేహౌండ్స్, ఆక్టోపస్ ఆపరేషన్స్ డీజీపీగా విక్రమ్‌సింగ్ మాన్ నియమితులయ్యారు. మరోవైపు, తెలంగాణ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, రోడ్ అండ్ రైల్ సేఫ్టీ బ్యూరో (TG-TMARS) డైరెక్టర్‌గా ఎం. స్టీఫెన్ రవీంద్ర, జాయింట్ డైరెక్టర్‌గా జోయల్ డేవిస్, డిప్యూటీ డైరెక్టర్‌గా బాలాదేవిలకు బాధ్యతలు అప్పగించారు.

ఇక శాంతిభద్రతల (లా అండ్ ఆర్డర్) అడిషనల్ డీజీపీగా అకున్ సబర్వాల్‌ను నియమించగా, సంజయ్‌కుమార్ జైన్‌కు అడిషనల్ డీజీపీ (ట్రైనింగ్)గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఏసీబీ డైరెక్టర్‌గా ఎస్. చంద్రశేఖర్‌రెడ్డి, మల్టీ జోన్-1 ఐజీపీగా కార్తికేయ, రైల్వేస్ ఐజీపీగా కె. రమేష్ నాయుడు బదిలీ అయ్యారు. వీరితో పాటు గద్వాల డీఐజీ జోన్-7 అదనపు బాధ్యతలను చందన దీప్తికి, బాసర డీఐజీ జోన్-2 అదనపు బాధ్యతలను కె. నారాయణనాయక్‌కు అప్పగించారు. ఇంటెలిజెన్స్ డీఐజీగా ఆర్. భాస్కరన్, కోఆర్డినేషన్ డీఐజీగా ఎల్.ఎస్. చౌహాన్, హైదరాబాద్ డీసీపీ (SM&IT)గా వి. అరవిందబాబులను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన అధికారులు త్వరలోనే తమ నూతన బాధ్యతలను స్వీకరించనున్నారు.