BREAKING
నూతన ఆవిష్కరణల దిశగా ముందుకు సాగాలి ఏఐ క్లౌడ్ కంపెనీ నెబియస్ సంచలనం నిందితుడి అరెస్ట్.. రిమాండ్ కు తరలింపు మెక్సికోపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక ఏఐ సెంటిమెంట్‌కు గండి, పడిపోయిన చమురు మరియు బంగారం ధరలు విద్యార్థుల మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలి - జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మహిళా క్రికెట్‌లో రాణించి జిల్లాకు కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలి.. ఆర్‌డీటీ క్రికెట్ అభివృద్ధి కమిటీ ఛైర్మన్ మచ్చా రామలింగారెడ్డి.. అనంతలో ముగిసిన ఆర్‌డీటీ మహిళా క్రికెట్ ప్రతిభాన్వేషణ రెండో విడత ఎంపికలు హంగేరీలో గర్భసొత్తిన మార్పులు మరియు వివాదాస్పద చట్టం రద్దు పెండింగ్ మున్సిపాలిటీ ల్లో ఎన్నికలు చల్ల రాజా ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి జన్మదిన వేడుకలు ఇంటర్మీడియట్ విద్యా విధాన విలీన నిర్ణయాన్ని పునఃపరిశీలించాలి: బీఆర్ఎస్వీ మునుగోడు నియోజకవర్గ అధ్యక్షుడు నలపరాజు రమేష్ వేసవిలో విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యలు చేపట్టాలి - టీజీ ఎన్పీడీసియల్ సిఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి ఐఏఎస్ ప్రోస్టేట్ క్యాన్సర్ స్క్రీనింగ్‌పై అమెరికన్ క్యాన్సర్ సొసైటీ కొత్త మార్గదర్శకాలు చేజర్ల వెంకటేశ్వర రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన కార్పొరేటర్ ఉచ్చు భువనేశ్వర ప్రసాద్ రేపటి నుంచే 45వ భారత అంతర్జాతీయ వాణిజ్య మేళా

నీటి సంరక్షణపై దృష్టి పెట్టాలి -డి ఆర్ డి ఓ సన్యాసయ్య

Select Suryaa Now
నీటి సంరక్షణపై దృష్టి పెట్టాలి  -డి ఆర్ డి ఓ  సన్యాసయ్య

 

మునగాల, మేజర్ న్యూస్ : నీటి సంరక్షణపై దృష్టి పెట్టాలని డి ఆర్ డి ఓ  ఆర్. సన్యాసయ్య అన్నారు. గురువారం మండల కేంద్రంలోని బరకత్ గూడెం గ్రామపంచాయతీ  రోడ్ ఫార్మేషన్ పనులను ఆయన సందర్శించి మాట్లాడారు ఎల్ నినో ప్రభావం వలన వర్షాలు లేవని, ప్రతి ఒక్కరూ నీటిని సంరక్షించుకోవాలని సూచించారు. ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు తీసుకోవాలని, ఫామ్ పాండ్స్ నిర్మించుకోవాలని తెలిపారు. వి బి జి రామ్ జి  పథకం ద్వారా కూలీలతో రైతులకు ఉపయోగపడే అనేక పనులు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నీటిని పొదుపుగా వాడాలని కూలీలకు పని ప్రదేశంలో అవగాహన కల్పించారు.

అనంతరం గ్రామ పంచాయతీ ఆవరణలో జలసిరి పనులలో భాగంగా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్, కమ్యూనిటీ సోక్ పిట్ పనులను పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ఎంపీడీవో నరేష్, సర్పంచ్ చల్ల గురవయ్య, ఏపీవో శైలజ, ఈసీ కళ్యాణ్, ఏపీఎం కరుణాకర్, టీఏ శ్రీధర్, పీఎస్ పవన్, ఐకేపీ సీసీ, ఎఫ్ఏ సులోచన తదితరులు పాల్గొన్నారు.