BREAKING
గ్రామపంచాయతీ ఎన్నికలు కోసం స్టేజ్ వన్ రిటర్నింగ్ అధికారుల శిక్షణా కార్యక్రమం క్యాన్సర్ చికిత్సను మరింత అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం చర్యలు నాణ్యమైన గృహ నిర్మాణానికి బిల్డర్లు ప్రాధాన్యమివ్వాలి-మంత్రి నారాయణ అర్హులైన ప్రతి కుటుంబానికి బీమా భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం.. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క.. పంచాయతీ ఎన్నికలకు పటిష్ట భద్రతా ప్రణాళిక ఓలా సంస్థకు పది లక్షల జరిమానా విధించిన సీసీపీఏ సుబ్రహ్మణ్యం కు గ్లోబల్ ఎడ్యుకేషనల్ అవార్డు భారత్ - శ్రీలంక సంయుక్త సైనిక విన్యాసాలు 'మిత్ర శక్తి 2026' ప్రారంభం రాష్ట్రపతి భవన్‌లో అట్టహాసంగా నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ ప్రదానోత్సవం ఫిర్యాదులు నిర్ణీత గడువు లోపు పరిష్కరించాలి --- జడ్పీ సీఈవో మధుసూదన్ మూడు రోజుల లాభాలకు గండి, నష్టాలతో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ స్థానిక సమరానికి జనసేన కసరత్తు. ఉదయగిరినియోజకవర్గంలో మండలాల వారీగా నేతల సన్నాహాలు. బెంగళూరు-మంగళూరు-మర్గావో మార్గాల్లో నూతన వందే భారత్ చైర్ కార్ సర్వీసులను ప్రారంభించిన ప్రధాని మోదీ భక్తిశ్రద్ధలతో నాగుల చవితి జాకీర్ నాయక్ ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్‌పై మరో ఐదేళ్లపాటు నిషేధం పొడిగింపు

సీఐఐ 31వ పార్టనర్ షిప్ సమ్మిట్‌లో విద్య‌, ఐటీ, ఎల‌క్ట్రానిక్స్, ఆర్టీజీఎస్ శాఖ‌ల‌ మంత్రి నారా లోకేష్

Select Suryaa Now
సీఐఐ 31వ పార్టనర్ షిప్ సమ్మిట్‌లో విద్య‌, ఐటీ, ఎల‌క్ట్రానిక్స్, ఆర్టీజీఎస్ శాఖ‌ల‌ మంత్రి నారా లోకేష్

సూర్య స్టేట్ బ్యూరో, విశాఖపట్నం.

గ్లోబల్ పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ ను కేవలం సందర్శించడమే గాక ఇక్కడ పెట్టుబడి పెట్టండి, ఆవిష్కరించండి, ఎదగండి. ఇక్కడ కేవలం మీ ఫ్యాక్టరీలు మాత్రమే నిర్మించకండి. ఆంధ్రప్రదేశ్ ను మీ కార్పోరేట్ హోమ్ గా చేసుకోవాలని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీఎస్ శాఖల మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీ గ్రౌండ్స్ లో సీఐఐ 31వ పార్టనర్ షిప్ సమ్మిట్ పారిశ్రామిక దిగ్గజాల కోలాహలం నడుమ అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ... ఈ సదస్సులో మనం ట్రేడ్, టెక్నాలజీ, ట్రస్ట్ గురించి మాట్లాడుతున్నాం. ఆంధ్రప్రదేశ్ లో, ఈ మూడు పదాలకు వాస్తవ రూపమిచ్చి పెట్టుబడులు, భాగస్వామ్యాలు, అవకాశాలుగా మార్చాలనుకుంటున్నాం. మా ప్రభుత్వ పూర్తి మద్దతు మీకు ఉంది. మా తలుపులు మీ కోసం ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయి, మా టీమ్‌లు ఎల్లవేళలా సిద్ధంగా ఉంటాయి. మీతో కలిసి పని చేయడానికి మేము ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ను ఆస్వాదించండి. మీరు తిరిగి వెళ్ళేటప్పుడు జ్ఞాపకాల కంటే ఎక్కువ తీసుకెళ్లండి. ఇక్కడి నుంచి మీ భవిష్యత్తును నిర్మించుకోవడానికి ఒక ప్రణాళికను తీసుకెళ్లండి. మా తరపున వంద శాతం మద్దతు మీకు ఉంటుంది. అని పారిశ్రామికవేత్తలకు మంత్రి లోకేష్ భ‌రోసా ఇచ్చారు.

ఇదీ మా బ‌లం-మా ధైర్యం…

మాకు వెయ్యి కిలోమీటర్లకు పైగా తీరప్రాంతం ఉంది. విశాఖపట్నం ప్రధాన పోర్టు, మా ఇతర పోర్టులు ఇప్పటికే సంవత్సరానికి సుమారు 10 కోట్ల టన్నుల కార్గోను నిర్వహిస్తున్నాయి. రామాయపట్నం, మూలపేట, మచిలీపట్నం, కాకినాడలలో నాలుగు కొత్త గ్రీన్‌ఫీల్డ్ పోర్టులు నిర్మాణంలో ఉన్నాయి, దీంతో ఈ సామర్థ్యం రెట్టింపు కాబోతోంది. ఈ వారంలో మీలో చాలా మంది మా కొత్త అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం, భోగాపురంలో దిగారు. ఈ ఎయిర్ పోర్టు ఆగస్టులో ప్రారంభమైంది. దీనికి 3,800 మీటర్ల రన్‌వే ఉంది, ఇది భారీ విమానాల కోసం నిర్మితమైంది. భారతదేశ విమానయాన మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంలో నిరంతరం మద్దతు ఇస్తున్న గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీకి, ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడంలో కృషి చేసిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకి, ఈ కలను నిజం చేసిన జీఎంఆర్ కు నా హృదయపూర్వక ధన్యవాదాలు.

ఐటి సిటీగా విశాఖపట్నం…

భారతదేశంలోని దాదాపు 60 శాతం ఎయిర్ కండిషనర్లు ఏపీ శ్రీసిటీలో ఒకే చోట తయారవుతాయి. భారతదేశ సముద్ర ఆహార ఎగుమతుల్లో పరిమాణం ప్రకారం సుమారు మూడో వంతు మా తీరం నుంచే వస్తుంది. రొయ్యల ఎగుమతుల్లో సుమారు 80 శాతం మా ఫార్మ్‌ల నుంచే వస్తుంది. భారతదేశ కోకోలో 40 శాతానికి పైగా మేమే పండిస్తాం. దేశంలో పండే ఎండు మిర్చిలో 40 శాతానికి పైగా గుంటూరు ప్రాంతం నుంచే వ‌స్తుంది, అందుకే మా ఆహారం ఘాటుగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ భారతదేశ ఫ్రూట్ బౌల్. దేశంలోనే పండ్ల ఉత్పత్తిలో అతిపెద్ద రాష్ట్రం ఏపీ, జాతీయ ఉత్పత్తిలో సుమారు 16 శాతం వాటా మాదే. చేపలు, గుడ్ల ఉత్పత్తిలో కూడా భారతదేశంలో మేమే మొదటి స్థానంలో ఉన్నాం. భారతదేశ ఎఫ్‌సీవీ పొగాకులో సగానికి పైగా ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తుంది. మా ఫ్యాక్టరీలే మా సామర్థ్యానికి నిదర్శనం. 2019లో కియా అనంతపురంలో ఉత్పత్తి ప్రారంభించినప్పటి నుంచి ఆ ప్లాంట్ నుంచి దాదాపు 19 లక్షల కార్లు బయటకు వచ్చాయి, అవి 90కి పైగా దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఇదే సమయంలో విశాఖపట్నం ఐటీ సిటీగా మారుతోంది. జనవరిలో ఇక్కడ కాగ్నిజెంట్ ప్రారంభమైంది, దాని శాశ్వత క్యాంపస్ సుమారు 25,000 మంది కోసం ప్రణాళిక రూపొందించారు. టీసీఎస్ కూడా ఇక్కడ ప్రారంభమైంది.

మేం వచ్చాక ఇండస్ట్రీ ఎకోసిస్టమ్ మారిపోయింది…

మా ప్రభుత్వ హయాంలో ఇది రెండో పార్టనర్‌షిప్ సమ్మిట్. జూన్ 2024 నుంచి మాకు రూ.22.6 లక్షల కోట్ల విలువైన పెట్టుబడి హామీలు వచ్చాయని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ఇది చారిత్రాత్మకం, అపూర్వం. అంతకంటే ముఖ్యంగా, వాటిలో 73 శాతం, అంటే 12.7 లక్షల మందికి ఉపాధి కల్పించే రూ.17.2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు అనుమతులుగా మారాయి, 51 శాతం గ్రౌండ్ అయ్యాయి. 7.4 లక్షల మందికి ఉపాధి కల్పించే రూ.5.9 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టుల నిర్మాణం ప్రారంభ‌మైంది. ఆంధ్రప్రదేశ్ లో పారిశ్రామిక ఎకోసిస్టమ్ మారిందనడానికి ఇది నిదర్శనం. ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ శ్రీసిటీలో రూ.5,000 కోట్ల ఫ్యాక్టరీని నిర్మిస్తోంది. విశాఖపట్నంలోనే గూగుల్ సంస్థ ఏఐ హబ్ లో 15 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెడుతోంది, గిగావాట్ స్థాయి డేటా సెంటర్ క్యాంపస్, అంతర్జాతీయ సబ్‌సీ కేబుల్ గేట్‌వేతో నిర్మితమవుతోంది. భారతదేశ చరిత్రలోనే ఇది అతిపెద్ద ఎఫ్‌డీఐ.

డిఫెన్స్ రంగంలో దూసుకుపోతున్న రేమాండ్స్..

ఈరోజు మూడు ప్రధాన కంపెనీల సక్సెస్ స్టోరీలో మేం ఎలా భాగమయ్యామో మీకు చెప్పాలనుకుంటున్నాను. నేను దీనిని ఫ్లిప్, స్కేల్, ఇంక్యుబేషన్ అని పిలుస్తాను. మొదటిది, ఫ్లిప్. తరతరాలుగా, ఒక కంపెనీ పేరు భారతదేశంలో ప్రముఖ బ్రాండ్ గా ఉంది. మీరు కొనగలిగే అత్యుత్తమ సూట్ ను ఆ కంపెనీ తయారు చేస్తుంది. తర్వాత ఇది ఇళ్లు కూడా నిర్మించింది. ఏరోస్పేస్, డిఫెన్స్ లోకి ఫ్లిప్ అవ్వాలని నిర్ణయించుకుంది. మేము వారికి భూమి, ప్రోత్సాహకాలు, ప్లగ్ అండ్ ప్లే మౌలిక సదుపాయాలు ఇచ్చాం. వారి ప్రాజెక్టులు, సుమారు రూ.1,200 కోట్ల విలువైనవి, రాయలసీమలోని టేకులోడులో ఏరోస్పేస్ విడిభాగాలు, గుడిపల్లిలో ఆటో విడిభాగాలు, రాప్తాడులో అపెరల్ పార్క్ వరకు వారి ప్రాజెక్టులు విస్తరించి ఉన్నాయి. ఇది మా కొత్త ఏరోస్పేస్ పాలసీ కింద వచ్చిన మొదటి పెట్టుబడి. వారి శంకుస్థాపన గత ఏడాది ఇదే సదస్సులో జరిగింది. ఏడాదిలోపే, ఆంధ్రప్రదేశ్ లోని వారి తాత్కాలిక కేంద్రంలో 30కి పైగా మెషిన్లు ఏర్పాటు చేసి ట్రయ‌ల్ ర‌న్ చేస్తున్నారు. అదే సమయంలో వారి ప్రధాన ప్లాంట్ కూడా నిర్మాణంలో ఉంది. ఆ కంపెనీ షేర్ ధర రెట్టింపు కంటే ఎక్కువైంది. ఆ కంపెనీ పేరు రేమండ్. త్వరలో రేమండ్ ఏరోస్పేస్, డిఫెన్స్ అండ్ ఇంజనీరింగ్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయి.

అతిపెద్ద సోలార్ సెల్ తయారీదారుగా ప్రీమియర్…

రెండోది, స్కేల్. భారతదేశంలో స్థిరపడిన సోలార్ తయారీదారులలో ఒకరు ఒక విచిత్రమైన సమస్యను ఎదుర్కొన్నారు. దేశవ్యాప్తంగా సోలార్ ఆకాంక్షలు వేగంగా పెరుగుతున్నాయి,  2030 నాటికి భారత్ 500 గిగావాట్ల నాన్-ఫాసిల్ సామర్థ్యాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. కేంద్ర ప్రభుత్వం సోలార్ సెల్స్ దిగుమతి చేసుకోవడం కాకుండా దేశంలోనే తయారుచేయాలని చెబుతోంది. వారు సెల్ సామర్థ్యాన్ని భారీ స్థాయిలో, వేగంగా నిర్మించాల్సి వచ్చింది. వారు 2025 ప్రారంభంలో మా దగ్గరకు వచ్చారు. మేము నాయుడుపేటలో ప్లగ్ అండ్ ప్లే మౌలిక సదుపాయాలు అందించాం. సుమారు 18 నెలల తర్వాత, వారు భారతదేశంలోనే అతిపెద్ద సోలార్ సెల్ తయారీ ప్లాంట్ ను ప్రారంభించారని చెప్పడానికి సంతోషిస్తున్నాను. 101 ఎకరాల్లో, రూ.3,293 కోట్ల పెట్టుబడితో ఏడు గిగావాట్ల ఎన్-టైప్ టాప్‌కాన్ సెల్స్ తయారీ పరిశ్రమ అక్కడ ఏర్పాటు చేశారు. దీంతో ఆ కంపెనీ భారతదేశంలోనే అతిపెద్ద సోలార్ సెల్ తయారీదారుగా మారింది. ఈ కంపెనీ పేరు ప్రీమియర్ ఎనర్జీస్.

చిన్న కంపెనీ భారీ పరిశ్రమగా మారబోతోంది…

మూడోది, ఇంక్యుబేషన్. మచిలీపట్నంలో ఎస్‌ఎస్‌డీ పాలిమర్స్ అనే ఎంఎస్‌ఎంఈ ఉంది. 30 ఏళ్లకు పైగా, ఇది అద్భుతమైన పనితీరు కనబర్చింది. రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి ఈఎంఐ షీల్డింగ్ కండక్టివ్ ఎలాస్టోమర్ గ్యాస్కెట్ల కోసం సీఈఎంఐఎల్ఏసీ టైప్ అప్రూవల్ పొందిన ఏకైక భారతీయ కంపెనీ ఇదే. వారి ఉత్పత్తులు భారతదేశం, విదేశాల్లో ఏరోస్పేస్, ఏవియేషన్, మెరైన్, నావల్ అప్లికేషన్‌లలో డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ లో ఉపయోగిస్తున్నారు. మేము అమరావతి క్వాంటం వ్యాలీని ప్రారంభించినప్పుడు, క్వాంటం కంపెనీల విడిభాగాలు తయారు చేయడానికి ఈ కంపెనీని భాగస్వామిని చేశారు. ఒక చిన్న పట్టణం నుంచి వచ్చిన ఆ చిన్న కంపెనీ, భవిష్యత్తులో పెద్ద కంపెనీగా అవతరించబోతోంది. అదే ఆంధ్రప్రదేశ్.

స్పీడ్..స్టెబిలిటీ..స‌ర్వీస్‌..మా విధానం…

ఆంధ్రప్రదేశ్ విధానంలో మొదటిది స్పీడ్. వ్యాపారం చేసే వేగం. రెండోది స్టెబిలిటీ: మా విధానాల స్థిరత్వం. మూడవది సర్వీస్. ప్రైవేట్ రంగంతో సమానమైన సేవ. ఒక ఉదాహరణ చెబుతాను. ఎస్క్రో ఖాతాల ద్వారా పారిశ్రామిక ప్రోత్సాహకాల చెల్లింపును మేము ప్రారంభిస్తున్నాం. అంటే మేము మీకు వాగ్దానం చేసిన ప్రోత్సాహకమే మీకు నేరుగా అందుతుంది, దాని కోసం మీరు మా వెంట పడాల్సిన అవసరం లేదు. ఆచరణలో స్థిరత్వం అంటే ఇదే. మీరు మాతో పని చేసినప్పుడు, మీరు మా క్లయింట్. మేము అత్యున్నత ప్రమాణాల వృత్తి నైపుణ్యం, కస్టమర్ సర్వీస్ కు కట్టుబడి ఉంటాం. మీకు ఏదైనా సమస్య, సూచన, ఫీడ్‌బ్యాక్ ఉంటే నన్ను నేరుగా వాట్సాప్ లో సంప్రదించవచ్చు. నేను సమాధానం ఇస్తాను. కొన్నిసార్లు మీ సొంత టీమ్‌ల కంటే వేగంగా మేం వేగంగా స్పందిస్తాం.

*ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురాబోతున్నాం*

త్వరలోనే ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురాబోతున్నాం. కేంద్ర ప్రభుత్వం తో చర్చించి కేంద్ర స్థాయిలో కూడా ఇటువంటి యాక్ట్ అమలు అయ్యేలా చర్చలు జరుపుతాం. ఇటువంటి యాక్ట్ వలన పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడానికి మరింత నమ్మకం ఏర్పడుతుంది.

ప్రధాన కార్యాలయాలను ఏపీకి తరలించండి!

మా వద్ద కేవలం ఫ్యాక్టరీ మాత్రమే నిర్మించకండి. మీ ప్రధాన కార్యాలయాన్ని ఏపీకి తరలించండి. ఎందుకంటే మొదటిది, మీరు జీవించే విధానం. స్వచ్ఛమైన గాలి, అందమైన తీరప్రాంతం, మీ నగరాల్లో మాదిరి ట్రాఫిక్ జామ్‌లు ఇక్కడ లేవు. రెండోది, ప్రతిభ. మా యువత ఆకాంక్షలతో పాటు నైపుణ్యంతో సిద్ధంగా ఉన్నారు. పరిశ్రమకు ఏమి అవసరమో దాని చుట్టూ మా కళాశాలలు, ఐటీఐలను మేం తీర్చిదిద్దుతున్నాం. మూడోది, కనెక్టివిటీ. ఒక ప్రధాన పోర్టు, నిర్మాణంలో మరో నాలుగు కొత్త పోర్టులు. గల్ఫ్, సింగపూర్ కు నేరుగా చేరే విమానాలతో భోగాపురంలో కొత్త అంతర్జాతీయ విమానాశ్రయం వ‌చ్చింది. నాలుగోది, భవిష్యత్తు ఇక్కడే నిర్మించబడుతోంది. గూగుల్ ఏఐ హబ్ విశాఖపట్నంలో వస్తోంది. మా రాజధాని అమరావతిలో ఐబీఎం.. టీసీఎస్, ఎల్ అండ్ టీ తో కలిసి క్వాంటం సిస్టమ్ టూల్‌ను ఏర్పాటు చేస్తోంది. 2027 ప్రారంభంలో కార్యకలాపాలు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఐదోది, యాక్సెస్. ఆంధ్రప్రదేశ్ లో మీరు సమావేశం కోసం నెలల తరబడి వేచి ఉండరు. మా ముఖ్యమంత్రి, మంత్రులు, నేను ఒక ఫోన్ కాల్ లేదా వాట్సాప్ సందేశం దూరంలోనే అందుబాటులో ఉంటామని మంత్రి లోకేష్ అన్నారు.