BREAKING
నిందితుడి అరెస్ట్.. రిమాండ్ కు తరలింపు మెక్సికోపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక ఏఐ సెంటిమెంట్‌కు గండి, పడిపోయిన చమురు మరియు బంగారం ధరలు విద్యార్థుల మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలి - జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మహిళా క్రికెట్‌లో రాణించి జిల్లాకు కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలి.. ఆర్‌డీటీ క్రికెట్ అభివృద్ధి కమిటీ ఛైర్మన్ మచ్చా రామలింగారెడ్డి.. అనంతలో ముగిసిన ఆర్‌డీటీ మహిళా క్రికెట్ ప్రతిభాన్వేషణ రెండో విడత ఎంపికలు హంగేరీలో గర్భసొత్తిన మార్పులు మరియు వివాదాస్పద చట్టం రద్దు పెండింగ్ మున్సిపాలిటీ ల్లో ఎన్నికలు చల్ల రాజా ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి జన్మదిన వేడుకలు ఇంటర్మీడియట్ విద్యా విధాన విలీన నిర్ణయాన్ని పునఃపరిశీలించాలి: బీఆర్ఎస్వీ మునుగోడు నియోజకవర్గ అధ్యక్షుడు నలపరాజు రమేష్ వేసవిలో విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యలు చేపట్టాలి - టీజీ ఎన్పీడీసియల్ సిఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి ఐఏఎస్ ప్రోస్టేట్ క్యాన్సర్ స్క్రీనింగ్‌పై అమెరికన్ క్యాన్సర్ సొసైటీ కొత్త మార్గదర్శకాలు చేజర్ల వెంకటేశ్వర రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన కార్పొరేటర్ ఉచ్చు భువనేశ్వర ప్రసాద్ రేపటి నుంచే 45వ భారత అంతర్జాతీయ వాణిజ్య మేళా గ్రామంలోకి బస్సు రావాలని గ్రామస్తుల ఆధ్వర్యంలో సర్పంచ్ ధర్న ధరల మంటతో సామాన్యుడు విలవిల.. నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించాలి

భూముల రీసర్వేను వేగవంతం చేయాలి - కలెక్టర్ ఇలా త్రిపాఠి

Select Suryaa Now
భూముల రీసర్వేను వేగవంతం చేయాలి - కలెక్టర్ ఇలా త్రిపాఠి
సూర్య బాల్కొండ /మెండోరా :  రైతులు, భూ యజమానుల ప్రయోజనార్థం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల రీసర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. జక్రాన్పల్లి మండలం మాదాపూర్, మెండోరా మండలం వెల్గటూర్ లో కొనసాగుతున్న భూముల రీసర్వే ప్రక్రియను కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం అదనపు కలెక్టర్ రాజాగౌడ్ తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ, రోవర్ సహాయంతో సర్వే నిర్వహిస్తున్న తీరును క్షుణ్ణంగా పరిశీలిస్తూ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలను పక్కాగా పాటిస్తూ, నిబంధనలకు అనుగుణంగా పూర్తి పారదర్శకంగా సర్వే నిర్వహించాలని, భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఉత్పన్నం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రైతులు, పట్టాదార్లకు ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు. ప్రతిరోజు సగటున 30 ఎకరాల చొప్పున సర్వేను నిర్వహిస్తూ, వేగవంతంగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అన్నారు. సర్వే సందర్భంగా క్షేత్రస్థాయిలో ఏవైనా ఇబ్బందులు ఏర్పడితే, తమ దృష్టికి తేవాలన్నారు. రీ సర్వే వేగవంతానికి అదనంగా అవసరమైన రోవర్ యంత్రాలను సమకూరుస్తామని అన్నారు. రీ సర్వే ప్రక్రియ నిర్వహణలో అలసత్వానికి తావిస్తే ఎంతమాత్రం ఉపేక్షించబోమని, నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు.సర్వే చేపట్టే ముందు సంబంధిత రైతులకు తప్పనిసరిగా ముందస్తు సమాచారం అందించి, వారి సమక్షంలో సర్వే నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. భూమి హద్దుల వివరాల నమోదులో పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గ్రామ హద్దు, ప్రభుత్వ భూమి, పట్టా భూములకు సంబంధించిన పూర్తి వివరాలు రీసర్వే ఆధారంగా పక్కాగా నమోదు చేయాలన్నారు. సర్వే అనంతరం గ్రామ సభలు నిర్వహిస్తూ, ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే వారి నుండి దరఖాస్తులు స్వీకరించి వేగంగా పరిష్కరించాలన్నారు. రీసర్వే విషయంలో రైతులకు, భూ యజమానులకు ఏవైనా సందేహాలు ఉంటే వాటిని నివృత్తి చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, రెవెన్యూ అధికారులు, రైతులు ఉన్నారు.