BREAKING
పొన్నూరు పట్టణంలో విజిలెన్స్ దాడులతో రైస్ అండ్ జనరల్ స్టోర్స్ మూసివేత పారిశుధ్యం పనులు పరిశీలించిన కౌన్సిలర్లు ముంబైలో బాంబు బెదిరింపుల కలకలం.. దాద్‌పల్లిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం కానున్న 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. తుఫాన్‌గా మారే అవకాశం! వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ కమిటీల నియామకం మెరుగైన వైద్యానికి రూ.7 లక్షల ఎల్‌ఓసీ అందజేత మంత్రి కందుల దుర్గేష్‌ను కలిసిన పి. గన్నవరం జడ్పీటీసీ యడ్ల సుబ్బలక్ష్మి దంపతులు ఉత్తర కొరియా రాజ్యాంగంలో చారిత్రాత్మక మార్పులు.. శోధనలో నైతికత, జవాబుదారీతనం అవశ్యం కోరిటికల్, లింగట్ల, వాంకిడి కేజీబీవీ పాఠశాలలను సందర్శించిన డీఈవో మాధవి అంబులెన్స్ లో గర్భిణీ ప్రసవం...... వడూర్ లో నీటి తొట్టి నిర్మాణానికి భూమి పూజ కార్తీకమాస శోభ.. రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు

అభివృద్ధి పనులలో పురోగతి సాధించాలి - జిల్లా కలెక్టర్ కె.హరిత

Select Suryaa Now
అభివృద్ధి పనులలో పురోగతి సాధించాలి - జిల్లా కలెక్టర్ కె.హరిత
సూర్య ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి : పర్యావరణాన్ని కాపాడుకుంటూ, వన్యప్రాణులను రక్షించుకుంటూ, అటవీ శాఖ అనుమతులతో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కె.హరిత అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ఉట్నూర్ ప్రాజెక్టు అధికారి మంద మకరందు, జిల్లా అటవీ అధికారి బాలమణి, జిల్లా అదనపు కలెక్టర్లు యువరాజ్ మర్మాట్, ఎం.డేవిడ్, అదనపు ఎస్.పి. చిత్తరంజన్, కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ హర్ష చౌదరి, ఆసిఫాబాద్ రాజస్వ మండల అధికారి లోకేశ్వర్ రావు లతో కలిసి జిల్లాస్థాయి అటవీ పరిరక్షణ కమిటీ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అడవిని కాపాడుకుంటూ, వన్యప్రాణులను రక్షించుకుంటూ, అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేరువయేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అంగన్వాడి, గ్రామపంచాయతీ, స్వయం సహాయక సంఘాల భవనాలు, పంచాయితీ రాజ్, రహదారులు భవనాలు, గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ శాఖల పరిధిలోని రహదారుల నిర్మాణాలకు అటవీ శాఖ అనుమతులు పొంది పనులు చేపట్టాలని తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల రీ సర్వే ప్రక్రియలో అటవీ, రెవెన్యూ శాఖల సమన్వయంతో సరిహద్దు వివాదాలు పరిష్కరించాలని తెలిపారు. వి బి జి రామ్‌ జి పథకం క్రింద కూలీలకు పనుల కల్పనలో భాగంగా పెద్ద ఎత్తున చెక్ డ్యామ్ నిర్మాణాలు చేపట్టాలని తెలిపారు. సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ఉట్నూర్ ప్రాజెక్టు అధికారి మాట్లాడుతూ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న రహదారుల పనులు ప్రధానమంత్రి జన్ మన్, ప్రధానమంత్రి జూగా పథకంలో మారుమూల గిరిజన గ్రామాలలో చేపడుతున్న అభివృద్ధి పనులలో అటవీ శాఖ అధికారులతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు. ఆర్ ఓ ఎఫ్ ఆర్ భూముల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జిల్లా అటవీ అధికారి మాట్లాడుతూ జిల్లాలో అక్రమ కలప రవాణా జరగకుండా, అటవీ భూమి ఆక్రమణ జరగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామని, సంబంధిత శాఖల అధికారులు అటవీ శాఖకు సహకరించాలని తెలిపారు. అభివృద్ధి పనులలో పారదర్శకంగా అనుమతులు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, తహసిల్దార్లు, అటవీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.