పారిశుధ్యం పనులు పరిశీలించిన కౌన్సిలర్లు
పారిశుధ్య పనులు పరిశీలించిన కౌన్సిలర్లు
కనిగిరి ,మేజర్ న్యూస్ :పట్టణంలోని 30,32 వార్డులలో డ్రైనేజి కాలువల పూడికతీత పనులు పారిశుధ్య కార్మికులు చేపట్టారు .వార్డులలో జరుగుతున్న పారిశుధ్య పనులను కౌన్సిలర్లు షేక్ ఫిరోజ్ ,నీలిశెట్టి అంజినాయుడు లు గురువారం పరిశీలించారు .డ్రైనేజి పూడికతీత పనులు సక్రమంగా నిర్వహించి మురుగు నీరు సాఫీగా వెళ్లేలా చూడాలని కార్మికులకు సూచించారు .ప్రజలు తమ గృహాలలోని చెత్తా చెదారాలను సైడు కాలువలలో ,రహదారులపై వేయకుండా ఇంటి వద్దకు వచ్చే పారిశుధ్య కార్మికులకు అందజేయాలని తెలిపారు .పరిసరాలు పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు .ఈ కార్యక్రమంలో టీడిపి నాయకులు షేక్ యాసిన్ ,చీర్ల నాగార్జున యాదవ్ ,పెన్నా కొండలు తదితరులు ఉన్నారు .