శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానము, హుండీ (పరకామణి సేవ) లెక్కింపు
నెల్లూరు, మేజర్ న్యూస్ : నెల్లూరు, మూలాపేటలో వేంచేసియున్న శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానములో తేది 12.11.2026 గురువారము నాడు హుండీ లెక్కింపు జరిగింది. ఈ కార్యక్రమములో తేది 03.09.2026 నుండి తేది 12.11.2026 వరకు (70 రోజులకు) దేవదాయ ధర్మదాయ శాఖ, ఇన్స్పెక్టర్ సి.హెచ్.శ్రీనివాసరావు ఆధ్వర్యములో హుండీ లెక్కింపు కార్యక్రమము జరిగినది. ఇందులో భాగంగా దేవస్థానానికి రూ.5,96,911/- హుండీ ద్వారా ఆదాయం లభించింది. . పై కార్యక్రమములో ట్రస్టుబోర్డు చైర్మన్ శ్రీ ఒట్టూరు సురేంద్రయాదవ్ , దేవస్థాన కార్యనిర్వహణాధికారి శ్రీ వి.గిరికృష్ణ మరియు ట్రస్టుబోర్డు సభ్యులు శ్రీమతి అల్లం లక్ష్మి , శ్రీ తమ్మినేని వెంకటరత్నం నాయుడు , శ్రీ కొండా కోటేశ్వర రెడ్డి , శ్రీ గుద్దేటి చెంచయ్య , శ్రీ కుమార్ హరికుమార్ , శ్రీమతి మన్నేపల్లి వెంకట లక్ష్మి ప్రసూనా, శ్రీ ముమ్మిడి కుమార్ , శ్రీమతి మిడతల మహాలక్ష్మి, ముఖ్య అర్చక శ్రీ పి.చంద్రశేఖర్ స్వామి మరియు అర్చక స్వాములు పాల్గొన్నారు.