BREAKING
భక్తిశ్రద్ధలతో నాగులచవితి పూజలు 30 మంది ప్రయాణికులు ఉంటే మీ వద్దకే ఆర్టీసీ బస్సు వైసిపి నుండి టిడిపి లోకి భారీ చేరికలు: పేదల ఆత్మగౌరవానికి పెన్షన్లు కొండంత అండ నాగుల చవితి వేడుకల్లో నల్లమరమ్మ తల్లీ పుట్ట నీ దర్శించుకున్న జీవీఎంసీ 5 వ వార్డు కార్పొరేటర్ ప్రజావసరాల భూములకు హైడ్రా రక్షణ.. 2,121 గజాలకు ఫెన్సింగ్‌ ఈనెల 15న రాజ్యాంగ దినోత్సవ సదస్సు.. గ్రామ పంచాయతీల సొంత నిధుల వినియోగంలో ప్రభుత్వ ఉపశమనం..… వైసిపి శ్రేణులు అయోమయం శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారు మహిమలు! పెద్ద శేష వాహనంపై మలయప్పస్వామి దర్శనం ఎల్‌నినో ప్రభావాల నేపథ్యంలో గ్రామసభలు పిల్లలను దత్తత తీసుకునేందుకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి ప్రతి బూత్‌లో బీజేపీని పటిష్టం చేయాలి:మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు బుద్ధి శ్రీనివాస్ పిలుపు జగదాంబ పోతురాజు నాగేంద్రుని పుట్ట వద్ద బారులు తీరిన భక్తులు..!

విద్యార్థులకు ఎన్నికలపై అవగాహన - కాగజ్‌నగర్‌లో క్విజ్, వ్యాసరచన పోటీలు

Select Suryaa Now
విద్యార్థులకు ఎన్నికలపై అవగాహన - కాగజ్‌నగర్‌లో క్విజ్, వ్యాసరచన పోటీలు
సూర్య,  కాగజ్‌నగర్: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రాధాన్యతను విద్యార్థులకు తెలియజేసేందుకు భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో గురువారం కాగజ్‌నగర్ డివిజన్ స్థాయి క్విజ్, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. డివిజన్ పరిధిలోని ఏడు మండలాలకు చెందిన ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.ఓటు హక్కు, ఓటరు జాబితా, ఈవీఎంలు, వీవీప్యాట్, పోలింగ్ ప్రక్రియ తదితర అంశాలపై పోటీలు నిర్వహించారు. ప్రతిభ కనబరిచిన క్విజ్, వ్యాసరచన విభాగాల్లో 20 మంది విద్యార్థులను ఈ నెల 17న ఆసిఫాబాద్‌లో జరిగే జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేశారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సబ్ కలెక్టర్ హర్ష్ చౌదరి హాజరై విజేతలకు ప్రశంసాపత్రాలు, బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, పోటీల నిర్వాహకులు మామిడాల తిరుపతయ్య, దుర్గం మోహన్, శశికాంత్, దామోదర్ పాల్గొన్నారు.