BREAKING
జాతీయ స్థాయి పోస్టర్ ప్రజెంటేషన్ పోటీల్లో మోడల్ స్కూల్ విద్యార్థినుల ప్రతిభ.. నామినేషన్ కేంద్రాలను సందర్శించిన కాశీబుగ్గ ఎస్‌హెచ్‌ఓ. బాలల దినోత్సవ వేడుకల్లో నెహ్రూకు ఘన నివాళి మై వాపస్ ఆఊంగా చిత్రంపై ఇంతియాజ్ అలీ ప్రత్యేక దృష్టి.. సినీ ప్రియుల్లో పెరుగుతున్న ఆసక్తి పంచాయతీ ఎన్నికల నామినేషన్, పోలింగ్, కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎస్సై జి. నరేష్ కడియపులంక సర్పంచ్ బరిలో కీలక పరిణామం.. పోటీ నుంచి తప్పుకున్న రాంజీ తల్లిదండ్రులు షర్మిలా ఠాగూర్, టైగర్ పటౌడీ బాల్య ఫొటోలను పంచుకున్న సోహా అలీ ఖాన్.. నెహ్రూతో అరుదైన చిత్రాలు కడియంలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం గోపాలపురంలో కేంద్ర బృందం పర్యటన రిటర్నింగ్‌ అధికారులకు ఆన్‌లైన్‌ ప్రక్రియపై అవగాహన బాలీవుడ్ తారలకు కొత్త భద్రతా వలయం.. ఆరు నుంచి ఏడుగురు సిబ్బందితో బందోబస్తు మొక్కజొన్న సాగులో మెలకువలపై శిక్షణ దీపావళి వేడుకలకు వెళ్లలేకపోయిన రిషి కపూర్.. అత్తగారు కవర్ చింపేసిన ఆసక్తికర ఘటన గుర్తుచేసుకున్న నీతూ కపూర్ సిద్దిపేట సభ ఏర్పాట్ల సమావేశంలో కాట శ్రీనివాస్‌గౌడ్ విజ్ఞాన్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

ఈనెల 15న రాజ్యాంగ దినోత్సవ సదస్సు..

Select Suryaa Now
ఈనెల 15న రాజ్యాంగ దినోత్సవ సదస్సు..
  • అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ ఆధ్వర్యంలో కార్యక్రమ పోస్టర్ ఆవిష్కరణ

సీతమ్మధార, సూర్య: భారత రాజ్యాంగ దినోత్సవం, వందేళ్ళ మహద్ చెరువు పోరాటం సందర్భంగా అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహిస్తున్నట్లు సొసైటీ అధ్యక్షుడు బొడ్డు కళ్యాణ రావు తెలిపారు. నగరంలోని రామ టాకీస్ రోడ్డులో గల అంబేద్కర్ భవన్ లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో కార్యక్రమ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 15న, ఉదయం 10 గంటలకు అంబేద్కర్ భవన్ లో జరగబోవు ఈ సదస్సును అన్ని వర్గాల ప్రజలు విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాశీం, అడిషనల్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మోకా సత్తిబాబు తదితరులు హాజరవుతున్నారని పేర్కొన్నారు. స్వేచ్ఛ ,సమానత్వం, సౌబ్రాతృత్వం ప్రాతిపదికపై అత్యున్నత రాజ్యాంగాన్ని దేశ ప్రజలకు అందించిన ఘనత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ దేనని చెప్పారు.  రాజ్యాంగాన్ని ఆమోదించి 77ఏళ్లు దాటినా నేటికీ అనేక రూపాల్లో అసమానతలు కొనసాగుతున్నాయని చెప్పారు. రాజ్యాంగాన్ని మార్చివేసే కుట్ర సాగుతుందని దాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత పౌరులపై ఉందన్నారు.సొసైటీ ప్రధాన కార్యదర్శి జె .వి. ప్రభాకర్ మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ నేతృత్వంలో మంచినీళ్ల కోసం మహద్ చెరువు పోరాటం వందేళ్లు పూర్తయ్యాయన్నారు. ఇది కేవలం మంచినీళ్ల కోసం మాత్రమే కాదని మానవ హక్కుల పోరాటమని పేర్కొన్నారు .భారత రాజ్యాంగం అధికరణలు 14 ,15, 16 ఈ పోరాటానికి ప్రేరణగా నిలుస్తున్నాయన్నారు. భారత రాజ్యాంగం అధికరణ17 అంటరానితనాన్ని నిషేధించినప్పటికీ ఇంకా కొనసాగడం  అమానవీయమని చెప్పారు. సామాజిక అసమానతలు తొలగింపుకు తొలిమెట్టుగా ఉన్న రిజర్వేషన్లను తొలగించే ప్రయత్నం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ పరిశ్రమలు ,సంస్థల ప్రైవేటీకరణ ద్వారా అన్యాయం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ కోశాధికారి గార సత్యనారాయణ,సహాయ కార్యదర్శి బత్తుల గౌతం బాబు, జై ఆంధ్ర, టి .త్రిమూర్తులు, కె .ఆర్. వి .ప్రసాద్,బొడ్డు రాజు ,టి .వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.